రేషన్‌ బియ్యం..మాకేం భయం!

ABN , First Publish Date - 2021-05-06T06:43:53+05:30 IST

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అద్దంకి చెందిన కొందరు వ్యక్తులు మార్టూరు మండలం వలపర్లను అ డ్డాగా చేసుకొని ఈ దందాను నడుపుతున్నారు. అక్క డ ఓ రైసు మిల్లును లీజుకు తీసుకున్న వారు రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు యథే చ్ఛగా ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు ప ట్టుబడినప్పటికీ వెరవకుండా వ్యవహారాన్ని సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పోలీసుల దాడులతో కొ ద్దిరోజులు మిన్నకున్న వారు ఇప్పుడు మళ్లీ సేకరణ ప్రారంభించారు.

రేషన్‌ బియ్యం..మాకేం భయం!
బియ్యాన్ని పరిశీలిస్తున్న పోలీసు అధికారులు (ఫైల్‌)

వలపర్ల అడ్డాగా అక్రమ వ్యాపారం

రీసైక్లింగ్‌ చేసి విక్రయం 

రెండు సార్లు పట్టుబడ్డా వెనక్కి తగ్గని అక్రమార్కులు

కొద్ది రోజులు వెనక్కి తగ్గి మళ్లీ ఎగుమతులు 


అద్దంకి, మే 5 : రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అద్దంకి చెందిన కొందరు వ్యక్తులు మార్టూరు మండలం వలపర్లను అ డ్డాగా చేసుకొని ఈ దందాను నడుపుతున్నారు. అక్క డ ఓ రైసు మిల్లును లీజుకు తీసుకున్న వారు రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు యథే చ్ఛగా ఎగుమతి చేస్తున్నారు. ఇప్పటికి రెండుసార్లు ప ట్టుబడినప్పటికీ వెరవకుండా వ్యవహారాన్ని సాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. పోలీసుల దాడులతో కొ ద్దిరోజులు మిన్నకున్న వారు ఇప్పుడు మళ్లీ సేకరణ ప్రారంభించారు. 


అద్దంకి నుంచి వలపర్లకు మకాం  


అద్దంకి కేంద్రంగా సుమారు దశాబ్దం క్రితం రేషన్‌ బియ్యం కొనుగోలు  చేసే ముఠా ఏర్పడింది. ఆరంభం లో పరిమితంగానే వ్యాపారం చేసిన వీరు ఆదాయం భారీగా వస్తుండటంతో విస్తరించారు. తొలుత అద్దంకి నడిబొడ్డున ఓ రైసు మిల్లును లీజుకు తీసుకొని వ్యవ హారాన్ని నడిపారు. తరచూ అధికారులు దాడులు చే స్తుండటంతో మకాం మార్చారు. రెండేళ్ల క్రితం మా ర్టూరు మండలం వలపర్లలోని ఒక రైసు మిల్లును లీ జుకు తీసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని బ ల్లికురవ, కొరిశపాడు, అద్దంకి  మండలాల నుంచి నె లనెలా పెద్ద మొత్తంలో రేషన్‌ బియ్యం  కొనుగోలు  చేసి వలపర్లకు తరలిస్తున్నారు. అక్కడ రీసైక్లింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. 


పోలీసుల ఉక్కుపాదంతో పరిమితంగానే..


జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందటం తో గత ఏడాది ఆగస్టులో వలపర్లలోని రైసు మిల్లుపై దాడి చేశారు. అక్కడ పెద్ద మొత్తంలో రేషన్‌  బి య్యం పట్టుబడ్డాయి. పోలీసు అధికారులు తీగ లాగితే డొంక  కదిలింది. అద్దంకికి  చెందిన  పాత ముఠా ఆ ధ్వర్యంలోనే ఈ దందా సాగుతున్నట్లు తేటతెల్లమైంది. అనంతరం కొద్దిరోజుల తర్వాత అదే రైస్‌మిల్లు సమీ పంలో రేషన్‌ బియ్యంతో వాహనం పట్టుబడినప్పటికీ తమకు సంబంధం లేదని తప్పించుకున్నారు. కొద్దికా లంపాటు పోలీసు అధికారులు రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపటంతో అక్రమార్కులు వెనక్కి తగ్గారు. రేషన్‌ బియ్యం కొనుగోలు రేటు కూ డా తగ్గించి వ్యాపారాన్ని పరిమితంగానే చేశారు. 


మళ్లీ ప్రారంభమైన ఎగుమతులు 


పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కొంతకాలంగా అడ్డుకట్ట ప డింది. మళ్లీ ఇప్పుడు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు ప్రారంభించారు. దీంతో అద్దంకి నియోజకవర్గంలో వ్యా పారులు కూడా ప్రస్తుతం రేషన్‌ బియ్యం కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఇప్పటికే పెద్దమొత్తంలోనే సేకరిం చినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం కొత్తగా మరో ముఠా ఏర్పడింది. దీంతో పాత, కొత్త వారి మధ్య అం తర్యుద్ధం నడుస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు దృష్టి సారించి రేషన్‌ బియ్యం అక్రమ ర వాణాను అరికట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టా లని పలువురు  కోరుతున్నారు.


Updated Date - 2021-05-06T06:43:53+05:30 IST