రూ.కోటి సరుకు స్వాహా

ABN , First Publish Date - 2022-08-12T06:01:57+05:30 IST

కొత్తూరు పౌరసరఫరాలశాఖ గిడ్డంగిలో రేషన్‌ సరుకులు పక్కదారి పట్టించారు. రూ.1.09 కోట్ల విలువైన సరుకులు మాయం చేశారు.

రూ.కోటి సరుకు స్వాహా

కొత్తూరు గిడ్డంగిలో సిబ్బంది చేతివాటం
కొత్తూరు, ఆగస్టు 11:
కొత్తూరు పౌరసరఫరాలశాఖ గిడ్డంగిలో రేషన్‌ సరుకులు పక్కదారి పట్టించారు. రూ.1.09 కోట్ల విలువైన సరుకులు మాయం చేశారు. గత నెల 22న జాయింట్‌ కలెక్టర్‌ విజయ సునీత పౌరసరఫరాలశాఖ గిడ్డంగిని తనిఖీ చేశారు. రికార్డుల్లో ఉన్న సరుకుకు, నిల్వ ఉన్న సరుకుకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం 8,756 బస్తాలకు గాను 4,774 బస్తాలు ఉన్నాయి. 3,982 బస్తాలు మాయం అయ్యాయి. పంచదార 410 బస్తాలకు గాను 234 ఉన్నాయి. 176 బస్తాలు హాంఫట్‌ అనిపించారు. చేశారు. కందిపప్పు 477 బస్తాలకు గాను 57 మాత్రమే గిడ్డంగిలో ఉన్నాయి. మిగిలిన 420 బస్తాలు పక్కదారి పట్టించారు. పామాయిల్‌ ప్యాకెట్లు 152కి గాను 4 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 148 ప్యాకెట్లు మింగేశారు. మాయం అయిన సరుకు విలువ రూ.1,09,20,338 గా అధికారులు నిర్ధారించారు. తనీఖీల అనంతరం గిడ్డంగి ఇన్‌చార్జి రామ్మెహన్‌ను తొలగించారు. డేటా ఎంట్రీ అపరేటర్‌ ప్రసన్న కుమార్‌, సెక్యురిటీగార్డు కృష్ణను విధుల నుంచి తొలగించారు. జేసీ విజయ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సూర్య చంద్రమౌళి తెలిపారు.



Updated Date - 2022-08-12T06:01:57+05:30 IST