మాస్క్‌ ఉంటేనే రేషన్‌

ABN , First Publish Date - 2020-03-28T10:36:25+05:30 IST

మాస్క్‌ ఉంటేనే రేషన్‌ డిపో వద్ద రేషన్‌ సరుకులు ఇచ్చేందుకు అధికారులు నిబంధనలు విధించారు. ఏప్రిల్‌ రేషన్‌ సరుకులను ఈనెల 29 నుంచి...

మాస్క్‌ ఉంటేనే రేషన్‌

నల్లజర్ల, మార్చి 27 : మాస్క్‌ ఉంటేనే రేషన్‌ డిపో వద్ద రేషన్‌ సరుకులు ఇచ్చేందుకు అధికారులు నిబంధనలు విధించారు. ఏప్రిల్‌ రేషన్‌ సరుకులను ఈనెల 29 నుంచి ప్రభుత్వం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఉచిత సరుకులు తీసుకునేందుకు ప్రజలు రేషన్‌ డిపోకు మాస్క్‌లు ధరించి వెళ్ళాలని సూచించింది. గ్రామస్థాయిలో మాస్క్‌లు దొరకని పరిస్థితి ఉండడంతో చేతి రూమాలు, టవల్‌తో మూతి, ముక్కు కప్పుకోవాలని, రేషన్‌ డిపో వద్ద ఏర్పా టుచేసిన సబ్బు, వాటర్‌తో చేతులు శుభ్రంగా కడుగుకోవాలని ఆదేశించింది. రేషన్‌ డిపోల వద్ద జనం గుంపులుగా ఉంటే సంబంధిత డీలర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రేషన్‌ సరుకుల్లో బియ్యం, కందిపప్పు మాత్రమే ఉచితంగా అందిస్తారు. పంచదారకు అర కిలో రూ.10 చెల్లించవలసి ఉంటుందని పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ రాజు పేర్కొన్నారు.

Updated Date - 2020-03-28T10:36:25+05:30 IST