రెబ్బెనలో తహసీల్దార్ రియాజ్‌అలీకి వినతిపత్రం ఇస్తున్న రేషన్‌డీలర్లు
చింతలమానేపల్లి/పెంచికలపేట/రెబ్బెన, జూలై 4: రేషన్‌డీలర్ల సమస్యలు పరిష్కరించాలని చింతలమానే పల్లి, పెంచికలపేట, రెబ్బెన తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రేషన్ డీలర్లు సోమవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చింతలమానేపల్లిలో ఆసంఘం మండలాధ్యక్షుడు పెంటయ్య మాట్లాడుతూ ఎండీ యూ ఆపరేటర్ల చేతిలో రేషన్ పంపిణీని పెట్టడం జాతీయ ఆహారభద్రతా చట్టానికి విరుద్దమన్నారు. ప్రజాపంపిణీలో రాష్ట్రానికో రకంగా కమీషన్ ఉండడం సరికాదన్నారు. కేంద్రం వన్‌రేషన్ వన్‌కమీషన్ విధా నం తీసుకురావాలని, క్వింటాలకు రూ.440 కమీషన్ ఇవ్వాలని కోరారు. అనంతరం పలుడిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్లకు అందజేశారు.