Abn logo
Oct 26 2021 @ 23:07PM

సివిల్‌ సప్లయ్స్‌ గోదాముల వద్ద డీలర్ల దర్నా

నాయుడుపేట టౌన్‌ :సివిల్‌ సప్లయ్‌ గోదాము వద్ద డీటీ సంధ్యకు వినతిపత్రం అందజేస్తున్న రేషన్‌ డీలర్లు

నాయుడుపేట టౌన్‌, అక్టోబరు 26 : నాయుడుపేట సివిల్‌ సప్లయ్స్‌ గోదాము వద్ద మూడు మండలాల రేషన్‌ డీలర్లు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంతోపాటు, ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్లను చెల్లించాలని తెలిపారు. అనంతరం డిప్యూటీ తహసీల్దారు సంధ్యకు వినతిపత్రం అందజేశారు. 

ఆత్మకూరు : స్థానిక సివిల్‌ సప్లయ్స్‌  గోడౌన్‌ వద్ద రేషన్‌ డీలర్లు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ గోతాలు పౌరసరఫరాల శాఖకు తిరిగి ఇచ్చేయాలన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. కమీషన్‌ బకాయిలను ఇవ్వాలని కోరారు.  అనంతరం సివిల్‌ సప్లై డిప్యూటీ తహసీల్దారు శేషయ్యకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల డీలర్ల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ మస్తాన్‌వలీ, వెంకటేశ్వర్లురెడ్డి, చిన్నవీరయ్యచౌదరి, పుల్లయ్య, రవి, నాగేశ్వరరావు, పలువురు డీలర్లు పాల్గొన్నారు.

ఆత్మకూరు :డీటీ శేషయ్యకు వినతిపత్రం అందజేస్తున్న డీలర్లు