Abn logo
Oct 27 2021 @ 01:04AM

రోడ్డెక్కిన రేషన్‌ డీలర్లు

పౌర సరఫరాల శాఖ గోదాం వద్ద నిరసన తెలియజేస్తున్న డీలర్లు


 సమస్యలు పరిష్కరించాలని  డిమాండ్‌

నర్సీపట్నం, అక్టోబరు 26 : బియ్యం సంచులకు డబ్బులు చెల్లించాలని నర్సీపట్నం, గొలుగొండ మండలాల రేషన్‌ డీలర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం పెదబొడ్డేపల్లి పౌర సరఫరాల గోదాం వద్ద వీరంతా ధర్నా నిర్వహించారు. బియ్యంతో వచ్చే గన్నీ సంచులు గత ప్రభుత్వంలో డీలర్లు  వెనక్కి ఇచ్చే పద్ధితి ఉండేది కాదని, వాటిని రేషన్‌ డీలర్లు అమ్ముకునే వారని తెలిపారు. కరోనా సమయంలో సంచులు ఉత్పత్తి లేక ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లు నుంచి గన్నీ సంచులు వెనిక్కి తీసుకొని రూ.16 చెల్లించేదని యూనియన్‌ అధ్యక్షుడు శ్రీను తెలిపారు. తర్వాత సంచి ధరను రూ.20లు పెంచారని, రెండు నెలలుగా సంచులకు డబ్బులు చెల్లించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇస్తున్న సంచులకు డీలర్లుకు డబ్బులు చెల్లించకుండా జీవో తీసుకురావడం వల్ల తమ  బతుకు తెరువు పోతుందని వాపోయారు. గన్నీ సంచులు రేషన్‌ డీలర్లు అమ్ముకొని బతికే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.