‘12న రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు’

ABN , First Publish Date - 2021-03-08T05:43:56+05:30 IST

కొలిమిగుండ్ల, మార్చి 7: శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలోని నాయునిపల్లె - పెట్నికోట గ్రామాల మధ్య ఉన్న గుండు మల్లేశ్వరస్వామి క్రీడా మైదానంలో 12వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ జడ్పీటీసీ ఎర్రబోతుల ఉదయభాస్కర్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటపాపిరెడ్డి తెలిపారు.

‘12న రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు’

కొలిమిగుండ్ల, మార్చి 7:  శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మండలంలోని నాయునిపల్లె - పెట్నికోట గ్రామాల మధ్య ఉన్న గుండు మల్లేశ్వరస్వామి క్రీడా మైదానంలో 12వ తేదీ నుంచి రాష్ట్ర స్థాయి రాతిదూలం పోటీలు నిర్వహిస్తున్నట్లు మాజీ జడ్పీటీసీ ఎర్రబోతుల ఉదయభాస్కర్‌రెడ్డి, ఎర్రబోతుల వెంకటపాపిరెడ్డి తెలిపారు. పాలపండ్ల సైజు ఎద్దుల పోటీలో మొదటి, రెండో, మూడో, నాలుగో, ఐదో విజేతకు వరుసగా రూ.30వేలు,  రూ.20వేలు,  రూ.10వేలు, రూ.5వేలు, ఐదవ బహుమతి రూ.2500 ఇస్తామన్నారు. 13న నిర్వహించే యూ కేటగిరి సేద్యపు ఎడ్ల పోటీల్లో విజేతలకు రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు అందిస్తామన్నారు. పాలపండ్ల సైజు ఎద్దులకు ఎంట్రీ ఫీజు రూ.400, యూ కేటగిరి సేద్యపు ఎద్దుల పోటీలకు రూ.500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎద్దుల యజమానులకు భోజన వసతిని ఏర్పాటు చేశామన్నారు. 

Updated Date - 2021-03-08T05:43:56+05:30 IST