మనిషి సాధారణం.. కార్లు అసాధారణం: రతన్ టాటా బంగ్లా, ప్రైవేట్ జెట్, ఖరీదైన కార్ల గురించి తెలిస్తే..

ABN , First Publish Date - 2021-12-29T13:18:11+05:30 IST

రతన్ టాటాకు ముంబైలోని కోలాబాలో..

మనిషి సాధారణం.. కార్లు అసాధారణం: రతన్ టాటా బంగ్లా, ప్రైవేట్ జెట్, ఖరీదైన కార్ల గురించి తెలిస్తే..

టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. దేశంలోనే అత్యంత దానకర్ణునిగా రతన్ టాటా పేరొందారు. సాధారణ జీవితం గడిపే రతన్ టాటాకు కార్లంటే విపరీతమైన మోజు. వాటి ఖరీదు కోట్ల రూపాయలలో ఉంటుంది. రతన్ టాటా దగ్గరున్న ఖరీదైన ఉపకరణాల జాబితాను చూద్దాం.


రతన్ టాటా ఇల్లు

రతన్ టాటాకు ముంబైలోని కోలాబాలో ఒక విలాసవంతమైన భవనం ఉంది. ఇది 14 వేల చదరపు అడుగు విస్తీర్ణంలో ఉంది. ఈ భవనం ఖరీదు రూ. 150 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ విలాసవంతమైన భవనంలో చాలా గదులు ఉండటానికి తోడు జిమ్, స్విమ్మింగ్ ఫూల్, సన్ డెక్, బార్, లాంజ్ మొదలైనవి కూడా ఉన్నాయి. 




ప్రైవేట్ జెట్ 

మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం రతన్ టాటా దగ్గర Dassault Falcon 2000 ప్రైవేట్ జట్ ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన ఇంజినీర్లు తయారు చేసిన ప్రైవేట్ జట్ ఖరీదు రూ. 224 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. రతన్ టాటా ట్రెండ్ పైలెట్. ఈ ప్లెయిన్‌ను ఆయనే స్వయంగా నడుపుతుంటారు. 




ఫెరారీ కాలిఫోర్నియా కారు 

రతన్ టాటాకు కార్లంటే ఎంతో ఇష్టం. అతని దగ్గరున్న కార్ల కలెక్షన్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. రతన్ టాటా దగ్గర టాప్ స్పీడ్, కన్వర్టబుల్, ఎరుపు రంగు ఫెరారీ కాలిఫోర్నియా కారు ఉంది. దీని ధర సుమారు రూ. 3.45 కోట్లు.




మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్‌ లగ్జరీ కార్‌

అత్యంత విలాసవంతమైన మాసెరటి క్వాట్రోపోర్టే జీటీఎస్‌ లగ్జరీ కారు కూడా రతన్ టాటా దగ్గరుంది. దీని ధర రూ. 1.71 కోట్ల నుంచి 2.11 కోట్ల మధ్య ఉంటుంది. ఈ కారంటే రతన్ టాటాకు ఎంతో ఇష్టమని చెబుతుంటారు. 




మెర్సిడెస్ బెంజ్- ఎస్ క్లాస్

3982 CC V8 పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ లగ్జరీ కారు.. రతన్ టాటా కార్ల కలెక్షన్లలో కనిపిస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర రూ. 157 కోట్ల నుంచి 1.62 కోట్ల మధ్య ఉంటుంది. 



Updated Date - 2021-12-29T13:18:11+05:30 IST