తాగునీటి సమస్య తీర్చాలని రాస్తారోకో

ABN , First Publish Date - 2021-10-26T03:19:20+05:30 IST

దుబ్బగూడెంలో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారుల పట్టించుకోవడం లేదని సోమ వారం ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేశారు. వారం రోజులుగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వాటర్‌ ట్యాంకులో నీరు నింపడం లేదు. దీంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

తాగునీటి సమస్య తీర్చాలని రాస్తారోకో
రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న దుబ్బగూడెం మహిళలు

కాసిపేట, అక్టోబరు 25: దుబ్బగూడెంలో వారం రోజులుగా తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారుల పట్టించుకోవడం లేదని సోమ వారం ఖాళీ బిందెలతో మహిళలు రాస్తారోకో చేశారు. వారం రోజులుగా త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వాటర్‌ ట్యాంకులో నీరు నింపడం లేదు. దీంతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తాయి. సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దుబ్బగూడెం కళ్యాణిఖని ఓసీపీ లో ముంపునకు గురవుతోంది. పునరావాసం కల్పించడంలో సింగరేణి, రెవెన్యూ అధికారులు అలసత్వం వహిస్తున్నారని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు.  విషయాన్ని సింగరేణి జీఎం, ఆర్డీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఎస్‌ఐ నరేష్‌ చేరుకుని తాగునీటి సర ఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.  

Updated Date - 2021-10-26T03:19:20+05:30 IST