చిదిమేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-10-18T06:23:10+05:30 IST

అర్ధరాత్రి మహిళ రోడ్డుపై ఒంటరిగా నడిచిన నాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టని పెద్దలు చెప్పిన మా టలు కేవలం మాటవరసకే పరిమితమవుతున్నాయి.

చిదిమేస్తున్నారు!

జిల్లాలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, హత్యలు

మానవత్వం మరిచి అఘాయిత్యాలు

పసి మొగ్గలపై కామాంధుల క్రూరత్వం

జిల్లా కేంద్రంలో వరుస ఘటనలు

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు17: అర్ధరాత్రి మహిళ రోడ్డుపై ఒంటరిగా నడిచిన నాడే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్టని పెద్దలు చెప్పిన మా టలు కేవలం మాటవరసకే పరిమితమవుతున్నాయి. అర్ధరాత్రి మాట దెవుడెరుగు.. పట్టపగలు మహిళలు, ఆడపిల్లలు రోడ్లపై నడిచి వెళ్లే పరిస్థితులు ప్రస్తుత స మాజంలో కనబడడం లేదు. జిల్లాలో వరుసగా జరు గుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో ఇటీవల చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనలు, మహిళల హత్యలు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకునే పరిస్థితులు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంతో అత్యాధునిక టెక్నాలజీ, కొత్త కొత్త విషయాలను కనుగొంటున్న మానవుడిలో దాగి ఉన్న మృగం మాత్రం మారడం లేదు. మహిళలు, ఆడపిల్లలు రోడ్లపైకి వస్తే చాలు కామంతో చూసే చూపులు.. వెకిలి చేష్టలు.. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మార్పు మాత్రం రావడం లేదు. పాలనలో లోపమా.. మానవుడిలో లోపమా.. కాలమే సమాఽదానం చెప్పాలి. 

జిల్లాలో పెరుగుతున్న నేరాలు

అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థ, దేశంలో పటిష్టమైన పోలీసు వ్యవస్థగా చెప్పుకుంటన్న మన రాష్ట్రంలో, జిల్లాలో నేరాలు మాత్రం రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా కేంద్రంలో వారం, 10రోజులుగా జరుగుతున్న అత్యాచార ఘటనలు పోలీసు వ్యవస్థను ప్రశ్నిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా రోజు ఏదో ఒక సం ఘటన జరుగుతోంది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో అత్యాచార ఘటనలు పోలీసు వ్యవస్థ పనితీరుకు మ చ్చగా మారుతున్నాయి. ఈ నెలలో 10రోజుల క్రితం నగరంలో నిత్యం రద్దీగా ఉండే బస్‌స్టాండ్‌ ప్రాంతంలో డిగ్రీ చదువుతున్న యువతిపై సాముహిక అత్యాచారం జరగగా.. ఐదు రోజుల క్రితం నగరంలోని 6వ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇద్దరు మైనర్‌ బాలికలకు చాకెట్ల ఆశ చూపి మహ్మద్‌ వసీం అనే వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన జరిగింది. శనివారం జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మైనర్‌ బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెలలో ఆర్మూర్‌లో ఒక బాలిక పట్ల ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించగా, మరికొన్ని ఘటనలు జిల్లాలో జరిగాయి. ఇటీవల మాక్లూర్‌ మండలం ముల్లంగి గ్రామ శివారులో అనుమానంతో భర్త భార్యను హత్య చేసిన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. 

చట్టాలు ఉన్నా ఆగని నేరాలు..

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయఘటన, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరిగిన దిశ ఘటన ఇలా ఎన్నో ప్రతీరోజు దేశంలో అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. దేశంలో 20ఏళ్ల లోపు వయసు కలిగిన బాలికలలో పదిలో ఒక వంతు బాలికలు లైంగిక చర్యల్లో పాల్గొనేలా బబలవంతం చేయబడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చ ట్టాలు తెచ్చినా వాటిపై కనీస అవగాహన కల్పించక పోవడం, చట్టాలకు కొన్ని లొసుగులు ఉండడం నేరస్థులు వాటిని అవకాశంగా మార్చుకుంటున్నారనే అపోహలు ఉన్నాయి. 

Updated Date - 2021-10-18T06:23:10+05:30 IST