రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెంట్ మండలంలో దొంగల బీభత్సం సృష్టించారు. బాటసింగారంలో వరుసగా 9 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బంగారం, వెండి నగలతో పాటు నగదును దోచుకెళ్లారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.