రంగారెడ్డి: జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మేట్ మండలంలోని తారమతిపేట్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ పేలుడు శబ్దాలతో లారీ దగ్ధమవుతోంది. ఈ క్రమంలో ఓఆర్‌ఆర్‌పై తారమతిపేట్ నుండి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డుపై రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి