మోనార్క్ అని చెప్పుకునే RGV సడన్‌గా ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-06-08T18:48:37+05:30 IST

రాంగోపాల్ వర్మ (Ramgopal Varma) తాజాగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై స్పందించారు.

మోనార్క్ అని చెప్పుకునే RGV సడన్‌గా ఎందుకిలా..!?

  • రఘునందన్ రావు చెప్పిందే నిజం..

Internet Desk: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకొని వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ramgopal Varma) తాజాగా జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై స్పందించారు. తాను మోనార్క్‌నంటూ చెప్పుకునే  ఆర్జీవీ అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Raghunandan Rao) చెప్పిందే నిజం అంటూ ట్వీట్ చేయడం విశేషం. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో రాజకీయ ప్రభావం ఉందన్నారు. నాయకులు ప్రభావితం చేయడంవల్లే పోలీసులు సరిగా విధులు నిర్వహించలేదని విమర్శించారు. సజ్జనార్ లాంటి సిన్సియర్ అధికారి టీఎస్ ఆర్టీసీకి పరిమితం అయ్యారని చెప్పారు. ఎంఐఎం నేతలకు టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని ఆరోపించారు. ఒక సామాన్యుడిగా తనకు మాత్రం రఘునందన్ రావు చెప్పిందే నిజమనిపిస్తోందని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

Updated Date - 2022-06-08T18:48:37+05:30 IST