రాందేవ్ బాబా యోగి కాదు...బీహార్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-05-27T12:14:35+05:30 IST

యోగా గురు రాందేవ్ బాబాపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు...

రాందేవ్ బాబా యోగి కాదు...బీహార్ బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలు

పాట్నా (బీహార్): యోగా గురు రాందేవ్ బాబాపై బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లోపతి వైద్య విధానానికి వ్యతిరేకంగా బాబా రాందేవ్ చేసిన విమర్శల నేపథ్యంలో బీహార్ బీజేపీ అధినేత తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. రాందేవ్ బాబా యోగా గురువు మాత్రమేనని, ఆయన యోగాపై ఎవరూ ప్రశ్నించలేరని, కాని అతను ఖచ్చితంగా యోగి కాదని జైస్వాల్ చెప్పారు. యోగి అంటే తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకునే వారని జైస్వాల్ తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొన్నారు. వైద్యనిపుణుడు అయిన జైస్వాల్ పశ్చిమ చంపారన్ నుంచి పలుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. యోగా గురువు రాందేవ్ వివాదంలో పడవద్దని ఐఎంఏను జైస్వాల్ కోరారు. కరోనా వైరస్ చికిత్సలో అల్లోపతి మందుల సామర్థ్యాన్ని రాందేవ్ ప్రశ్నించారు. దీనిపై రాందేవ్ పై ఉత్తరాఖండ్ ఐఎంఏ కేసు వేసింది. 

Updated Date - 2021-05-27T12:14:35+05:30 IST