ఎన్నికల కమిషనర్ నుంచి జ్ఞాపిక అందుకుంటున్న సబ్‌కలెక్టరు సింహాచలం
రంపచోడవరం, జనవరి 25: రంపచోడవరం సబ్ కలెక్టరు కట్టా సింహా చలానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్‌వో) అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ నుంచి సింహాచలం అవార్డుతోపాటు జ్ఞాపిక అందుకున్నారు. ఉత్తమ సహాయ ఎన్నికల అధికారిగా పిఠాపురం తహశీల్దారు వరహాలయ్య, ఉత్తమ బీఎల్‌వోగా రంపచోడవరం పంచాయతీ కార్యదర్శి ఎం.ఈశ్వరరావు అవార్డులు అందుకున్నారు.