బీసీలు రాజకీయంగా ఎదగాలి : ఎల్‌ రమణ

ABN , First Publish Date - 2020-10-31T07:59:16+05:30 IST

దేశంలో సగానికిపైగా ఉన్న బీసీలు పుట్టుకతో తాము నాయకులం కాదనే న్యూనతాభావాన్ని పెంచుకోవడంతోనే రాజకీయంగా ఎదగలేకపోతున్నారని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు.

బీసీలు రాజకీయంగా ఎదగాలి : ఎల్‌ రమణ

ఖైరతాబాద్‌, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో సగానికిపైగా ఉన్న బీసీలు పుట్టుకతో తాము నాయకులం కాదనే న్యూనతాభావాన్ని పెంచుకోవడంతోనే రాజకీయంగా ఎదగలేకపోతున్నారని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్‌. రమణ అన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీసీ టైమ్స్‌ మాసపత్రిక ఆధ్వర్యంలో ‘మన ఓటు మనమే వేసుకుందాం’ అనే నినాదంతో ఓటు ఆవశ్యకత అనే అంశంపై బీసీల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం లక్డీకాపూల్‌లోని సెంట్రల్‌ కోర్టు హోటల్‌లో జరిగింది. దీనికి ఎల్‌. రమణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ బీసీలందరూ పక్కా సమాచారం, సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. టీడీపీ తరఫున బీసీలకు రాజకీయ ప్రాధాన్యం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం సభాధ్యక్షుడు సూర్యారావు మాట్లాడారు. కార్యక్రమంలో ఎంబీ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ రవిశంకర్‌, బీసీ జాగృతి అధ్యక్షుడు మురళీకృష్ణ, నిజాం కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ యాదగిరి, పలు కుల సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:59:16+05:30 IST