Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 01 Nov 2021 20:12:48 IST

ఆర్యజనని లాంబ్‌కాన్ వర్క్‌షాప్‌ పోస్టర్ విడుదల

twitter-iconwatsapp-iconfb-icon

హైదరాబాద్: గర్భిణులకు మార్గదర్శనం చేస్తున్న ఆర్య జనని నవంబరు 7న నిర్వహించబోయే ప్రత్యేక వర్క్‌షాప్‌ పోస్టర్‌ను రామకృష్ణ మఠంలో విడుదల చేశారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరక్టర్ స్వామి శితికంఠానంద, ఆర్యజనని బృంద సభ్యులు, సక్షమ్ ఉపాధ్యక్షుడు లక్కరాజు కాశీనాథ్ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని వెంటనే http://www.lambcon.org/ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. 


తల్లి పాల విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేసేందుకు దక్షిణాసియాలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న సమావేశం ఇది. తల్లి పాల నిర్వహణ, తల్లిపాల బ్యాంకింగ్, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడంపై ఈ సదస్సు జరుగుతుంది. హైదరాబాద్‌లోని రామకృష్ణ మఠం సహకారంతో ఆర్యజనని ఈ సమావేశాన్ని ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తుంది. 


లాక్టేషన్ మేనేజ్‌మెంట్, మిల్క్ బ్యాంకింగ్ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ కాన్ఫరెన్స్ (లాంబ్‌కాన్) నవంబరు 7 ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఓ మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు రెండేళ్ళ వయసు వచ్చే వరకు అంటే 1,000 రోజుల వరకు చాలా కీలకమైన దశ అని, ఈ దశలో గర్భిణులు పాటించవలసిన సూచనలను ఈ వర్క్‌షాప్‌లో ఆర్యజనని ఇస్తుంది. 


ఆర్యజనని ఇన్‌స్ట్రక్టర్ నేతృత్వంలో మల్టిపుల్ సెషన్స్‌లో ఈ వర్క్‌షాప్ జరుగుతుంది. ప్రసవానికి ముందు యోగా, గాఢమైన విశ్రాంతి, శ్వాసించడం, ధ్యానం వంటివాటికి సంబంధించిన శక్తిమంతమైన చిట్కాలను తెలియజేస్తారు. బిడ్డను పోషించడం, చనుబాలు ఇవ్వడం, శిశువుకు పోషకాహారం గురించి సమగ్ర సమాచారం ఇస్తారు. 


ఇటువంటి విజ్ఞానాన్ని అందించే తొలి వర్క్‌షాప్ ఇదేనని, దీనిలో పాల్గొనేవారికి లోతైన అనుభవం వస్తుందని ఆర్యజనని టీమ్ తెలిపింది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. గర్భధారణ, మాతృత్వం గురించి ప్రయోజనకరమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు నిపుణులతో మాట్లాడవచ్చునని, అనుభవజ్ఞులైన దంపతులు, తల్లులతో సంభాషించవచ్చునని, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా తమ ఇళ్ళ నుంచే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని పేర్కొంది. 


బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలక దశపై దృష్టి పెడుతూ, పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాల ద్వారా, సాధికార మానవ జాతిని నిర్మించాలనేదే ఆర్యజనని లక్ష్యమని వివరించింది. తేలికపాటి, శక్తిమంతమైన చిట్కాల ద్వారా అభివృద్ధి నాణ్యతను పెంచడం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపింది. ప్రసవానికి ముందు పడే ప్రభావాలకు సంబంధించిన కేస్ స్టడీస్‌ను ఆర్యజనని వెబ్‌సైట్ www.aaryajanani.org ద్వారా తెలుసుకోవచ్చునని తెలిపింది. 


ప్రారంభ సమావేశంలో అత్యంత ప్రముఖులు పాల్గొంటారని, వీరిలో స్వామి శితికంఠానంద (హైదరాబాద్ రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్, సీనియర్ మాంక్), డాక్టర్ సుకుమార్ జీ (సక్షమ్ ఫౌండేషన్‌), డాక్టర్ అశోక్ వార్షణేయ్ జీ (ఆరోగ్య భారతి), డాక్టర్ అశ్విని కుమార్ టుప్కరీ జీ (సేవాంకుర్) ఉన్నారని తెలిపింది. 


ఈ వర్క్‌షాప్‌లో ఎవరు పాల్గొనవచ్చు?


గర్భధారణ కోసం ప్రణాళిక వేసుకున్నవారు, డాక్టర్లు, నేచురోపతిస్, ఫిజియోథెరపిస్టులు, న్యూట్రిషనిస్టులు, గర్భిణులు, వివాహితులు, బాలింతలు, 0-2 ఏళ్ళ వయసుగల బిడ్డల తల్లిదండ్రులు, నర్సులు, మిడ్‌వైవ్స్, కౌన్సెలర్స్, క్లినికల్ సైకాలజిస్టులు, ఎంఎస్‌డబ్ల్యూ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఎన్‌జీవోలు, కార్పొరేట్లు, మదర్ సపోర్ట్ గ్రూపులు, ఆసక్తిగల ఇతరులు స్వేచ్ఛగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.