ఈవో రమాదేవికి శుభాకాంక్షలు తెలుపుతున్న పూర్వ ఈవో కృష్ణప్రసాద్, ఆలయ ఉద్యోగులు
వేములవాడ, జనవరి 17 : వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఎల్.రమాదేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగంలో పనిచేస్తున్న రమాదేవిని పూర్తి అదనపు బాధ్యతలతో వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఇన్‌చార్జి కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆమె సోమవారం ఉదయం ప్రస్తుత ఈవో డి.కృష్ణప్రసాద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, ఏఈవోలు ఎస్.హరికిషన్, జయకుమారి, బి.శ్రీనివాస్, ప్రతాప నవీన్, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, సూపరింటెండెంట్లు బి.తిరుపతిరావు, నరసింహమూర్తి, గోలి శ్రీనివాస్, వెల్ది సంతోష్, అరుణ్, హరిహరనాథ్, నాగుల మహేశ్ తదితరులు నూతన ఈవోను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.