భారత్‌ను రక్తపు మడుగులో ఉంచాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది : Rajnath Singh

ABN , First Publish Date - 2022-06-17T02:01:19+05:30 IST

జమ్మూ-కశ్మీరులో శాంతికి భంగం కలిగించాలని పాకిస్థాన్ నిరంతరం

భారత్‌ను రక్తపు మడుగులో ఉంచాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది : Rajnath Singh

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో శాంతికి భంగం కలిగించాలని పాకిస్థాన్ నిరంతరం ప్రయత్నిస్తోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గురువారం ఆయన బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడుతూ, భారత్‌ను వెయ్యి ముక్కలు చేసి, రక్తపు మడుగులో ముంచాలనేది పాకిస్థాన్ వైఖరి అని చెప్పారు. 


Bleed India with a Thousand Cuts అనేది పాకిస్థాన్ మిలిటరీ సిద్ధాంతం. భారత దేశంపై పరోక్ష యుద్ధం చేయాలనేది ఈ సిద్ధాంత సారాంశం. అనేక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులతో యుద్ధం చేయాలనేది పాకిస్థాన్ (Pakistan) వ్యూహం. 


రాజ్‌నాథ్ (Rajnath Singh) మాట్లాడుతూ, మన పొరుగు దేశం (పాకిస్థాన్) నిరంతరం భారత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్నారు. గతంలో ఉగ్రవాద కార్యకలాపాలను మనం ఎదుర్కొన్నామని చెప్పారు. భారత దేశాన్ని వెయ్యి ముక్కలు చేసి, రక్తమోడేలా చేయాలనే సిద్ధాంతంతో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దేశ ఐకమత్యం, సమగ్రతలకు భంగం కలిగించాలని ప్రయత్నిస్తే, భద్రతా దళాలు పాకిస్థాన్‌కు దీటుగా సమాధానం చెబుతాయని హెచ్చరించారు. 


రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజులపాటు జమ్మూ-కశ్మీరులో పర్యటించి, భద్రతా పరిస్థితులను సమీక్షిస్తారు. 


Updated Date - 2022-06-17T02:01:19+05:30 IST