RGIPTలో బీటెక్‌, ఐడీడీ

ABN , First Publish Date - 2022-09-17T21:41:09+05:30 IST

అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ(Rajiv Gandhi Institute of Petroleum Technology) (ఆర్‌జీఐపీటీ) - బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయెల్‌ డిగ్రీ (ఐడీడీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022/ జేఈఈ

RGIPTలో బీటెక్‌, ఐడీడీ

అమేథీలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం టెక్నాలజీ(Rajiv Gandhi Institute of Petroleum Technology) (ఆర్‌జీఐపీటీ) - బీటెక్‌, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయెల్‌ డిగ్రీ (ఐడీడీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022/ జేఈఈ (మెయిన్‌) 2022 స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. బీటెక్‌ వ్యవధి నాలుగేళ్లు. ఐడీడీ వ్యవధి అయిదేళ్లు. ఇందులో బీటెక్‌, ఎంటెక్‌ డిగ్రీలు పొందవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లలో భాగంగా 16 వారాల ఇంటర్న్‌షిప్‌ కూడా ఉంటుంది. మెరిట్‌ కం మీన్స్‌ స్కాలర్‌షిప్‌ కింద ఎంపిక చేసిన అభ్యర్థులకు 25 శాతం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు.

బీటెక్‌ స్పెషలైజేషన్‌లు-సీట్లు: కెమికల్‌ 50, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 60, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ 50, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 30, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 50, మేథమెటిక్స్‌ అండ్‌ కంప్యూటింగ్‌ 40, పెట్రోలియం ఇంజనీరింగ్‌ 50, రెన్యూవబుల్‌ ఎనర్జీ ఇంజనీరింగ్‌ 30, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ డిజైన్‌ ఇంజనీరింగ్‌ 30, జియో సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ 20 

ఐడీడీ స్పెషలైజేషన్‌-సీట్లు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ 40


అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ)/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(అడ్వాన్స్‌డ్‌) 2022 అర్హత పొందిన అభ్యర్థులు, కనీసం 80 శాతం మార్కులతో ఇంటర్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్‌) 2022 అర్హత పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు వర్తిస్తాయి.


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.1416; మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.708

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 27

మొదటి రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: సెప్టెంబరు 29

అడ్మిషన్‌ ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: అక్టోబరు 8

సెకండ్‌ రౌండ్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: అక్టోబరు 11

వెబ్‌సైట్‌: rgipt.ac.in

Updated Date - 2022-09-17T21:41:09+05:30 IST