Abn logo
May 13 2021 @ 15:21PM

కోవిడ్ రెండవ డోసు తీసుకున్న రజినీకాంత్

చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో గురువారంనాడు కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నారు. తన తండ్రి వ్యాక్సిన్ తీసుకుంటున్న ఫోటోను రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. రజినీకాంత్ తన తాజా చిత్రం 'అణ్ణాత్తే' కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నెలరోజుల పాటు సుదీర్ఘ షూటింగ్ పూర్తి చేసుకుని బుధవారంనాడే చెన్నై చేరుకున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. శివ దర్శకత్వంలో గ్రామీణ కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార, మీనా, ఖుష్బూ, ప్రకాష్ రాజ్, సూరి వంటి ప్రముఖ తారాగణం నటిస్తోంది. సన్ పిక్చర్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement