Abn logo
Feb 27 2021 @ 00:39AM

రాజేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్ట్‌

సంతమాగులూరు, ఫిబ్రవరి 26 : సంతమాగులూరు గ్రామంలోని ద్వారకానగర్‌కు చెందిన అంగిరేకుల రాజేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులైన అంగిరేకుల శ్రీనివాసరావు, కోటేశ్వరమ్మలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి సీఐ ఆంజనేయరెడ్డి తెలిపి న వివరాల ప్రకారం..  అంగిరేకుల శ్రీనివాసరా వు, రాజేశ్వరికి ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. కొంత పాలం పాటు వీరు సంతోషం గా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంవత్సరన్న కాలం నుంచి రాజేశ్వరికి ఆరోగ్యం బాగులేక పొలం వెళ్లలేక ఇంటి వద్దనే ఉంటోం ది. దీంతో ఆమె భర్త, అత్త కోటేశ్వరమ్మలు సూ టిపోటీ మాటలతో రాజేశ్వరిని మానసికంగా బాధ పెడుతుండేవారని ఆంజనేయరెడ్డి తెలిపా రు. ఈ తరుణం లో రాజేశ్వరి మానసిక బాధకు లోనై ఈనెల 21వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాజేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం శ్రీనివాసరావు, కోటేశ్వరమ్మలను అరెస్టు చేసిన ట్లు వారు తెలిపారు. 


Advertisement
Advertisement
Advertisement