రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-06-04T02:57:20+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదు

రాజస్థాన్ రాష్ట్రంలో కొత్తగా 279 కరోనా కేసులు నమోదు

జైపూర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాజస్థాన్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకు రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం రోజు కొత్తగా రాజస్థాన్ లో 279 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,652 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా నుంచి 6,744 మంది కోలుకుంటున్నారని, అందులో నుంచి 6,208 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం 2,699 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు రాజస్థాన్ సర్కారు వెల్లడించింది.


Updated Date - 2020-06-04T02:57:20+05:30 IST