Rajasthan సీఎం సలహాదారు అసెంబ్లీలో షాకింగ్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-03-23T17:11:49+05:30 IST

రాజస్థాన్ రాష్ట్ర సీఎం సలహాదారు,సిరోహి ఎమ్మెల్యే సన్యామ్‌ లోధా అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు...

Rajasthan సీఎం సలహాదారు అసెంబ్లీలో షాకింగ్ వ్యాఖ్యలు

జైపూర్‌:రాజస్థాన్ రాష్ట్ర సీఎం సలహాదారు,సిరోహి ఎమ్మెల్యే సన్యామ్‌ లోధా అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు.హరిదేవ్ జోషి యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ సవరణ బిల్లు 2022పై చర్చ సందర్భంగా లోధా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.తాము గాంధీ-నెహ్రూ కుటుంబానికి బానిసలమేనని సన్యామ్‌ లోధా వ్యాఖ్యానించారు.‘‘అవును, మేం మా చివరి శ్వాస వరకు బానిసలం. మేం గాంధీ-నెహ్రూలకు బానిసత్వం చేస్తాం.’’ అని లోధా అన్నారు. రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సలహాదారుల్లో ఒకరైన సిరోహి ఎమ్మెల్యే సన్యామ్‌ లోధా తనతోపాటు, ఇతర కాంగ్రెస్‌ నేతలను గాంధీ-నెహ్రూ కుటుంబానికి బానిసలుగా అభివర్ణించారు. 


దీంతో ప్రతిపక్ష ఉపనేత రాజేంద్ర రాథోడ్ స్పందించారు ‘‘అయ్యో, బానిసలారా! ఇది కొత్త సంస్కృతి. బానిసత్వం కోసం మీకు అభినందనలు’’ అని రాథోడ్ అన్నారు.‘‘ఇంత బానిసత్వం తర్వాత కూడా కాంగ్రెస్ మీకు (లోధా) టికెట్ ఇవ్వలేదు’’ అని బీజేపీ ఎమ్మెల్యే కాళీచరణ్ సరాఫ్ చెప్పడంతో వెంటనే సభలో గందరగోళం నెలకొంది.లోధా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. తాజాగా ఆయనను సీఎం సలహాదారుగా నియమించారు.తర్వాత అసెంబ్లీ హరిదేవ్ జోషి యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్స సవరణ బిల్లును రాజస్థాన్ శాసనసభ ఆమోదించింది.


Updated Date - 2022-03-23T17:11:49+05:30 IST