వైద్యవిధాన పరిషత్‌ వైద్యుల మూకుమ్మడి బదిలీ?

ABN , First Publish Date - 2022-08-09T07:04:48+05:30 IST

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 8 : రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడ పనిచేస్తున్న మొత్తం 40 మంది వైద్యుల బదిలీలకు సంబంధించి మంగళవారం వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారులు జూమ్‌ విధానంలో బదిలీల కౌన్సెలింగ్‌ చేపడుతున్నారు. రాజమహేంద్రవరంలో మెడికల్‌ కాలేజీ మంజూరు, దానికి అనుగుణంగా కొద్దిరోజుల కిందటే మెడికల్‌

వైద్యవిధాన పరిషత్‌ వైద్యుల మూకుమ్మడి బదిలీ?

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 8 : రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల మూకుమ్మడి బదిలీలకు రంగం సిద్ధమైంది. ఇక్కడ పనిచేస్తున్న మొత్తం 40 మంది వైద్యుల బదిలీలకు సంబంధించి మంగళవారం వైద్యవిధాన పరిషత్‌ ఉన్నతాధికారులు జూమ్‌ విధానంలో బదిలీల కౌన్సెలింగ్‌ చేపడుతున్నారు. రాజమహేంద్రవరంలో మెడికల్‌ కాలేజీ మంజూరు, దానికి అనుగుణంగా కొద్దిరోజుల కిందటే మెడికల్‌ కాలేజీకి ప్రిన్సిపాల్‌ను, సూపరింటెండెంట్‌లను ప్రభుత్వం నియమించడం తెలిసిందే. వైద్యకళాశాల, సర్వజన ఆసుపత్రి నిర్వహణ (జీజీహెచ్‌) వంటివన్నీ డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) పరిధిలోకి వెళ్లిపోవడంతో ఇక్కడి వైద్యుల బదిలీ అనివార్యంగా చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులంతా ఏపీ వైద్యవిధాన పరిషత్‌ (ఏపీ వీవీపీ) పరిధిలో ఉన్నారు. తమను డీఎంఈలోకి తీసుకుని ఇక్కడే కొనసాగించాలని ఇక్కడి వైద్యులంతా పలుమార్లు విజయవాడ వెళ్లి వైద్యవిధాన పరిషత్‌, డీఎం ఈ ఉన్నతాధికారులను కలసినా ఫలితం లేదు. కనీసం ఐదేళ్లపాటు తమను ఫారిన్‌ డిప్యు టేషన్‌పై డీఎంఈలో కొనసాగించాలని కోరినా ఉన్నతాధికారులు ససేమిరా అనడంతో వైద్యులంతా అసంతృప్తితో ఉన్నారు. వీరిలో చాలామంది కొవ్వూరు ఏరియా ఆసుపత్రికి, మరికొందరు అనపర్తి సీహెచ్‌సీకి బదిలీ కోరుతున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-08-09T07:04:48+05:30 IST