ప్రాణాలకు.. ‘సెక్యూరిటీ’ ఏదీ?

ABN , First Publish Date - 2021-02-25T05:33:57+05:30 IST

రోగుల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఆస్పత్రుల్లో రోగులకు సెక్యూరిటీ గార్డులే దిక్కవుతున్నారు. వారికి తెలిసీ తెలియని వైద్యం చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో ఓ సెక్యూరిటీ గార్డు.. వైద్యుడి అవతారమెత్తిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టగా.. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటప డింది.

ప్రాణాలకు.. ‘సెక్యూరిటీ’ ఏదీ?
చికిత్స చేస్తున్న సెక్యూరిటీ గార్డు

రాజాం సీహెచ్‌సీలో వైద్యుడి అవతారమెత్తిన సెక్యూరిటీ గార్డు

వైద్యుల నిర్లక్ష్యంతో రోగులకు అరకొర సేవలు

సూపరింటెండెంట్‌, వైద్యసిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం

పనితీరు మార్చుకోవాలంటూ హెచ్చరిక

(రాజాం/రూరల్‌, ఫిబ్రవరి 24)

రోగుల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా రు. దీంతో ఆస్పత్రుల్లో రోగులకు సెక్యూరిటీ గార్డులే దిక్కవుతున్నారు. వారికి తెలిసీ తెలియని వైద్యం చేసి.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతు న్నారు. రాజాం సామాజిక ఆస్పత్రిలో ఓ సెక్యూరిటీ గార్డు.. వైద్యుడి అవతారమెత్తిన సంఘటన చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై ఆర్డీవో విచారణ చేపట్టగా.. వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటప డింది. వివరాల్లోకి వెళితే.. రాజాం సామాజిక ఆస్పత్రిలోని సెక్యూరిటీ గార్డు సంజీవ్‌.. వైద్యుడి అవతారమెత్తాడు. ఇక్కడ ఎన్‌ఎమ్‌ఏ(నాన్‌ మెడికల్‌ అసిస్టెంట్‌) పోస్టు లేదు. దీంతో ఎమర్జెన్సీ కేసులు వచ్చి నప్పుడు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది ఎవరు లేని సమయంలో ఇక్కడ సెక్యూరీటీ గార్డులకు ఈ విధులను అప్పగిస్తున్నారు. ఆసు పత్రిలో ప్రస్తుతం 11 మంది వైద్యులు, సుమారు  40 మంది సిబ్బం ది ఉన్నారు. వీరంతా విధులకు సక్రమంగా హాజరుకావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సహకారంతోనే విధులకు డుమ్మా కొడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమ ర్శలు వెల్లువెత్తుతున్నాయి. సూపరింటెండెంట్‌.. పారిశుధ్య కార్మికు లను తన ఇంటి పనులకు, ఆస్పత్రి సిబ్బందిని కారుడ్రైవర్‌గా విని యోగించుకుంటారనే ఆరోపణలున్నాయి. ఇదే అదనుగా వైద్యసిబ్బంది రెగ్యులర్‌గా విధులు నిర్వర్తించడం లేదు. దీంతో సెక్యూరిటీ గార్డులే వైద్యుల అవతారమెత్తుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడు తున్నారు. తాజాగా మంగళవారం జి.సిగడాం మండలం మెట్టవల సలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరగ్గా.. క్షతగాత్రులను రాజాం సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యసిబ్బంది లేకపో వడంతో క్షతగాత్రులకు సెక్యూరిటీ గార్డు సంజీవ్‌.. ప్రథమ చికిత్స చేసి కుట్లు వేయడం చర్చనీయాంశమైంది.  ప్రజల ప్రాణాలంటే ఇక్కడి వైద్యులకు లెక్కలేదనే వాదన వినిపిస్తోంది. 


మారని తీరు

కలెక్టర్‌ నివాస్‌, పాలకొండ ఆర్డీవో కుమార్‌లు.. పలుమార్లు రాజాం సీహెచ్‌సీని సందర్శించారు. వైద్యులు, సిబ్బంది పనితీరు మార్చు కోవాలని హెచ్చరించారు. అయినా ఇక్కడ వైద్యసిబ్బందిలో ఎటు వంటి మార్పు కనబడడం లేదు. తాజాగా ‘సెక్యూరిటీ గార్డు.. వైద్యుడి అవతారం’ విషయమై పాలకొండ ఆర్డీవో కుమార్‌.. బుధవారం విచారణ చేపట్టారు. గతంలో హెచ్చరించినా.. మీలో ఎందుకు మార్పురావడం లేదంటూ వైద్యులను ప్రశ్నించారు. సెక్యూరిటీ గార్డు.. వైద్యసేవలు అందజేయాల్సిన కారణం ఏమిటని ఆస్పత్రి సూపరింటెం డెంట్‌ ఎం.చంద్రశేఖర్‌ నాయుడును నిల దీశారు. ఎన్‌ఎమ్‌ఏ పోస్టు లేకపోవడంతో.. రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర సమయంలో ఇలా చేయాల్సి వచ్చిందని ఆయన బదులిచ్చారు. దీనిపై పూర్తిస్థాయిలో నివేదిక అందజేయాలని సూపరింటెండెం ట్‌ను ఆర్డీవో ఆదేశించారు. ‘మీరు సక్రమంగా విధులు నిర్వహించక పోవడంతో వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా రు. మీ పని తీరులో మార్పు వస్తేనే ఆస్పత్రి బాగుపడుతుంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి’ అని సూపరింటెండెంట్‌కు హెచ్చరించారు. 

అనంతరం విలేకరులతో ఆర్డీవో మాట్లాడుతూ.. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామ న్నారు. ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందజేసేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ పి.వేణు గోపాలరావు తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-02-25T05:33:57+05:30 IST