స్థలాల ఆక్రమణలపై రజకుల ఆందోళన

ABN , First Publish Date - 2021-10-20T04:37:03+05:30 IST

తమకు ఇచ్చిన స్థలాల ను వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఇండ్ల స్థలాల వద్దే రజకులు ఆందోళనకు దిగా రు.

స్థలాల ఆక్రమణలపై రజకుల ఆందోళన
ఇంటి స్థలాల వద్ద ఆందోళన చేస్తున్న రజకులు

బద్వేలు రూరల్‌, అక్టోబరు 19: తమకు ఇచ్చిన స్థలాల ను వైసీపీ నేతలు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ మంగళవారం ఇండ్ల స్థలాల వద్దే రజకులు ఆందోళనకు దిగా రు. లబ్ధిదారులు వెంకటసుబ్బయ్య, పాపయ్య, ఆంజనేయులు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల కిందట అప్పటి తహసీల్దార్‌ 27 మంది రజకులకు ఒకొక్కరికి రెండు సెంట్ల చొప్పున గుంతపల్లె రెవెన్యూ పొలం సర్వే నెం. 1206లో ఇంటి స్థలాలను మంజూరు చేశారన్నారు.

అప్పట్లో కొం దరు బేస్‌మెంట్‌ వరకు నిర్మాణాలు చేశారని మరి కొం దరు చేతిలో చిల్లిగవ్వ లేక చేయలేకపోయారన్నారు. ఇటీవల రఘునాధ పురం, గుంతపల్లి వైసీపీ నేతలు ఈ స్థలాలు మావే నంటూ దౌరజన్యాలకు దిగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వారాలుగా రెవెన్యూ అధికారులకు గోడు వెల్లబోసుకున్నా ఫలితం లేకపోగా అధికార పార్టీ నేతలు తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోభీ ఘాట్‌ కు ఇచ్చిన ఎకరా 10 సెంట్లు కూడా ఆక్రమణకు గురవుతోందని అధికారులు న్యాయం చేయాలని డిమాండ్‌ చే శారు. ఈ ఆందోళనలో సుభాషిణి, ఎల్లమ్మ, వెంకటసుబ్బమ్మ, గుర్రమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T04:37:03+05:30 IST