Abn logo
Mar 4 2021 @ 01:24AM

బిల్లులు ఇవ్వకుంటే పనులు బంద్‌

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కాంట్రాక్టర్లు

రాజమహేంద్రవరం సిటీ,మార్చి 3: రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ తమకు ఇవ్వాల్సిన రూ.25 కోట్లు బిల్లులను ఇవ్వకుంటే 5వ తేదీ నుంచి పనులను నిలుపుదల చేస్తామని మునిసిపల్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శ్రీనివాస్‌ (కాపు), కృష్ణమూర్తి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌ క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కాంట్రాక్టర్లు రామచంద్రరావు, రామారావు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో చేసిన అభివృద్ధి పనులకు రూ.4 కోట్లు 67 లక్షలు,  కరోనా సమయంలో చేసిన పనులకు రూ.6 కోట్లు, 14వ ఆర్థిక సంఘం పనులకు రూ.10 కోట్లు రావాల్సి ఉన్నా, కార్పొరేషన్‌ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడు తున్నామన్నారు. అప్పులకు వడ్డీలు కట్టలేని తమ సహచర కాంట్రాక్టర్లు విజయ శామ్యూల్‌, రమణ, గురుపల్లి, మట్టా జయధర్‌ మానసిక ఒత్తిడితో మృతిచెందారని చెప్పారు.  బిల్లులు తక్షణమే చెల్లించకపోతే ఈ నెల 5 నుంచి పనులు ఆపేసి బంద్‌కు వెళ్తామని చెప్పారు. కాంట్రాక్టర్లు గోపాలకృష్ణ, బషీర్‌ రాజు, ఎండీ మూసా, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement