స్వార్థంతోనే మూడు రాజధానులు

ABN , First Publish Date - 2022-01-25T06:05:35+05:30 IST

మూడు రాజధానుల ప్రకటనలో రాషా్ట్రభివృద్ధి కంటే పాలకుల స్వార్థ ప్రయోజనాలే ఎక్కువని అమరావతి రైతులు తెలిపారు.

స్వార్థంతోనే మూడు రాజధానులు
తుళ్లూరు శిబిరంలో సేవ్‌ అమరావతి, సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ప్లకార్డులతో నినాదాలు చేస్తున్న మహిళలు

769వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు

తుళ్లూరు, జనవరి 24: మూడు రాజధానుల ప్రకటనలో రాషా్ట్రభివృద్ధి కంటే పాలకుల స్వార్థ ప్రయోజనాలే ఎక్కువని అమరావతి రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రాజధాని గ్రామాలలో రైతులు చేస్తోన్న ఆందోళనలు సోమవారంతో 769వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ధర్నా శిబిరాల నుంచి మహిళలు, రైతు కూలీలు, రైతులు మాట్లాడుతూ విశాఖ చుట్టు పక్కల, తెలంగాణలోని ఆస్తుల విలువ పెంచుకోవడానికి అమరావతిని చంపేస్తూ మూడు ముక్కల ఆటకు తెరతీశారన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన అమరావతిని పాలకులు కుటిలత్వంతో అణగదొక్కారన్నారు.    అమరావతిని అభివృద్ధి చేస్తుంటే దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయల సంపద రాష్ట్రానికి సమకూరేదన్నారు. భావితరాల భవిష్యత్‌ కోసం అమరావతికి భూములిస్తే, అసలు  భవిష్యత్తే లేకుండా చేయాలని సీఎం జగన్‌రెడ్డి కంకణం కట్టుకున్నారన్నారు. రాష్ట్ర  భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. 

Updated Date - 2022-01-25T06:05:35+05:30 IST