అభివృద్ధి అంటూనే కుట్రలా?

ABN , First Publish Date - 2021-02-28T05:45:24+05:30 IST

అభివృద్ధి చేస్తామంటూనే అమరావతిపై కుట్రలు చేస్నున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చే శారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 438వ రోజుకు చేరుకుంది.

అభివృద్ధి అంటూనే కుట్రలా?
పెనుమాకలో నిరసన దీక్షలో పాల్గొన్న రైతులు

అమరావతిపై కపట ప్రేమ తగదు

438వ  రోజుకు చేరుకున్న రైతుల ఆందోళనలు


తుళ్లూరు, ఫిబ్రవరి 27: అభివృద్ధి చేస్తామంటూనే అమరావతిపై కుట్రలు చేస్నున్నారని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చే శారు. అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధాని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం శనివారం 438వ రోజుకు చేరుకుంది. తుళ్లూరు, పెదపరిమి, రాయపూడి, అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, ఐనవోలు, నేలపాడు, వెలగపూడి, మందడం, ఉద్దండ్రాయునిపాలెం, లింగాయపాలెం, నెక్కల్లు, తదతర గ్రామాల్లో ఆందోళనలు కొనసాగాయి. జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని రైతులు నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అమరావతిపై కపట ప్రేమ చూపిస్తూ లోలోపల కుట్ర పన్నుతోందని ఆరోపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు.  తాడేపల్లి మండలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగాయి.

  

 

Updated Date - 2021-02-28T05:45:24+05:30 IST