మూషిక వాహనంపై రాజా గణపతి

ABN , First Publish Date - 2021-09-18T06:58:14+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి రథోత్సవానికి బదులు మూషిక వాహన సేవ నిర్వహించారు.

మూషిక వాహనంపై రాజా గణపతి
ఉత్సవ మూర్తికి హారతి ఇస్తున్న అర్చకుడు ధర్మేశ్వరగురుకుల్‌

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 17: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి రథోత్సవానికి బదులు మూషిక వాహన సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకర్లవారిపల్లెకు చెందిన ఎత్తిరాజులునాయుడు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె మీనాకుమారి, శివప్రసాద్‌, కాణిపాకానికి చెందిన మాజీ వీఎం పూర్ణచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ వీఎం చంద్రశేఖర్‌రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరిప్రసాదరెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం మూల విరాట్‌కు ఘనంగా అభిషేకం చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలకు సంప్రదాయ బద్ధంగా పూజాది కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ఉత్సవర్లను మూషిక వాహనంపై అధిష్ఠించి, ప్రాకారోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌, సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.


బ్రహ్మోత్సవాల్లో నేడు

కాణిపాక బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం భిక్షాండి కార్యక్రమాన్ని ఆలయం వారు నిర్వహించనున్నారు. తిరుకల్యాణం నిర్వహణకు కాణిపాకం, తిరువణంపల్లెకు చెందిన వణిగ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు. రాత్రి నిర్వహించే అశ్వవాహన సేవకు బొమ్మసముద్రం, తిరువణంపల్లె, చింతమాకులపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన గోనగుంట బలిజ వంశస్తులు ఉభయదారులుగా వ్యవహరిస్తారు. 



Updated Date - 2021-09-18T06:58:14+05:30 IST