చినుకు..వణుకు

ABN , First Publish Date - 2020-10-15T07:06:56+05:30 IST

భారీ వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం పాలమూరు జిల్లా వ్యాప్తంగా 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం

చినుకు..వణుకు

ముప్పు తెచ్చిన ముసురు

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఆగమైన అన్నదాతలు

మూడు రోజులుగా తెరపి ఇవ్వని వర్షాలు

ఉధృతంగా పారుతున్న వాగులు, వంకలు

మత్తడి దూకుతున్న చెరువులు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

కూలుతున్న మట్టి మిద్దెలు

మరో మూడ్రోలు వానలు

అప్రమత్తమైన అధికారులు


మబ్బులకు చిల్లులు పెట్టినట్లు నిమిషం గ్యాప్‌ లేకుండా వర్షం పడుతూనే ఉంది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మూడు రోజులుగా పొద్దస్తమానం ఉమ్మడి పాలమూరు జిల్లాలో చోట్ల ముసురు కమ్మేసింది.. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వేల ఎకరాల్లో వరి పైర్లు నేలకొరిగాయి.. పత్తి గింజలు నల్లబారాయి.. కంది పూత దశంలోనే రాలిపోతోంది.. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరుతుండటంతో ప్రజలు ప్రభుత్వ పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి.. వర్షాలకు చెరువులు, కుంటలు ఉధృతంగా పారుతుండటంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి..


(మహబూబ్‌నగర్‌-ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/(గద్వాల/నాగర్‌కర్నూల్‌/వనపర్తి-ఆంధ్రజ్యోతి)/గద్వాల క్రైం/గద్వాల రూరల్‌/ నారాయణపేట/నారాయణపేట క్రైం/వెల్దండ/గ ట్టు/మూసాపేట/దేవరకద్ర/చిన్నచింతకుంట/భూత్పూర్‌/గండీడ్‌/మహబూబ్‌ నగర్‌, అక్టోబరు 14 : భారీ వర్షాలు ఉమ్మడి పాలమూరు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం పాలమూరు జిల్లా వ్యాప్తంగా 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 1,085 చెరువులకు గాను అన్నీ అలుగులు పారుతు న్నాయి. 16 చెక్‌డ్యామ్‌లు నిండిపోయాయి. మహబూబ్‌నగర్‌లోని కొత్తచెరువు 30 ఏళ్ల తర్వాత అలుగు పారుతోంది. కోయిలసాగర్‌ ప్రాజెక్టు ఐదు గేట్లను ఎత్తి దిగు వకు నీటిని విడుదల చేస్తున్నారు. భూత్పూర్‌ మండలం ముత్యాలంపల్లి వద్ద వా గు ఉధృతి పెరగడంతో లోలెవల్‌ వంతెన నీట మునిగింది. సుజాత అనే వృద్ధురా లిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి రావడంతో మంచంపై ఎత్తుకొని యువకులు వాగు దాటించారు. సీసీకుంట మండలం సీతారాంపేట, నెల్లికొండి మధ్య పెద్దవాగు పొంగింది. బండర్‌పల్లి, లాల్‌కోట, వడ్డెమాన్‌, ఏదులాపూర్‌, చిన్నచింతకుంట, మ ద్దూరు, అల్లీపురం గ్రామాల శివారులలో ఊకచెట్టువాగు నిండుగా పారుతున్నది.


మూసాపేట మండలం నిజాలాపూర్‌, దాసరిపల్లి గ్రామాల్లో ఇళ్లు కూలిపోయాయి. గండీడ్‌ మండలం మహ్మదాబాద్‌, నంచర్ల, వెన్నాచెడ్‌, గండీడ్‌, ధర్మాపూర్‌, వెంకట్‌ రెడ్డిపల్లి, రుసుంపల్లి, గాధిర్యాల్‌, మోకార్లబాద్‌, కొంరెడ్డిపల్లి, ఆశిరెడ్డిపల్లి, లింగాయ పల్లి గ్రామాల్లో వరి, పత్తి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయాధికారి కృపాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 1.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగైతే దాదాపు 80 వేల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. దాదాపు 15 వేల ఎకరాల్లో వరి నేలకు వాలింది. సీసీకుం ట, దేవరకద్ర, మూసాపేట, గండీడ్‌, జడ్చర్ల ప్రాంతాల్లో కంది పూత నేలరాలింది. ఎక్సైజ్‌ శాఖ మంత్రి విశ్రీనివాస్‌గౌడ్‌ జిల్లా కేంద్రంలోని ఏనుగొండలోని లోతట్టు ప్రాంతంతోపాటు మండలంలోని అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లిలో వర్షాలకు దెబ్బతి న్న పంటలను కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి పరిశీలించారు. పంటలు దెబ్బతిని న ష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరో మూడ్రోజులు వర్షా లు కురిసే అవకాశం ఉండటంతో పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రెమారాజేశ్వరి ఆదేశించారు. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షాలకు 8,141 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయ ని జిల్లా వ్యవసాయ శాఖాధికారి గోవింద్‌నాయక్‌ తెలిపారు. అందులో వరి 1,313 ఎకరాలు, పత్తి 560 ఎకరాల్లో, కంది 651 ఎకరాల్లో, మిరప 271 ఎకరాల్లో, ఉల్లి 110 ఎకరాల్లో, వెరుశేనగ 141 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు చెప్పారు. అలాగే పట్టణం లోని హమాలికాలనీకి చెందిన పరశురాముడు అనే వ్యక్తికి చెందిన ఇంటి పైకప్పు కూలిపోయింది. వర్షాలకు గద్వాల మండలం మేలచెరువు గ్రామంలోని నల్లకుంట చెరువు, పెద్దచెరువులు అలుగు పారడంతో రైల్వే ట్రాక్‌ కిందికి నీళ్లు చేరాయి. సం గాల చెరువు అలుగుపారడంతో శెట్టి ఆత్మకూర్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.మర్లపల్లి, జిల్లెడబండ చెరువుల అలుగులు పారాయి. జమ్మిచేడు జీవికుంట చెరువులోకి నీళ్లు రావడంతో పొలాలు మునిగాయి. రేకులప ల్లి వద్ద కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించిన తహసీ ల్దార్‌ సత్యనారాయణరెడ్డి వీఆర్‌ఏను కాపలా ఉంచారు.


నారాయణపేట జిల్లా వ్యాప్తంగా దాదాపు 40 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అందులో పత్తి, కంది, జొన్న పంటలు 25 వేల ఎకరాల్లో, వరి 15 వేల ఎకరాల్లో నేలకొరిగింది. కృష్ణా, మాగనూర్‌, మక్తల్‌ మండలాలతో పాటు నది పరివాహక ప్రాంతాల్లో వరి పంట నేలకొరిగింది. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ చేతనలు అత్యవసర సమయాల్లో కంట్రోల్‌ రూంకు సమాచారం చేరవేయాలని సూచించారు. పంటలకు జరిగిన నష్టాన్ని వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో ఏఈఓలు క్షేత్ర స్థాయిలో పరిశీలించే పనిలో పడ్డారు. జిల్లాలో 1,125 చెరువులు ఉండగా, 125 చెరువులు పూర్తి గా నిండాయి. మి గిలిన 963 చెరువులు అలుగు పారుతున్నాయి.


భారీ వర్షాలు నాగర్‌కర్నూల్‌ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. దాదాపు ఐ దు లక్షల ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వ కుర్తి, కొల్లాపూర్‌ నియోజకవర్గాలలో దాదాపు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఉ ప్పునుంతలలో గొల్లవాగు విపరీతంగా ప్రవ హిస్తుండడంతో రాకపోకలకు జనం ఇబ్బం దులు పడుతున్నారు. నాగర్‌కర్నూల్‌ చెరువు లో పడి మృతి చెందిన మల్లేష్‌ మృతదేహం తాడూరు మండలం చెర్లతిర్మలాపూర్‌లో తేలిం ది. జిల్లా వ్యాప్తంగా 103 ఇళ్లు వర్షానికి దెబ్బతిన్న ట్లు అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. శిథిల భవనాల్లో నివసిస్తున్న వారిని ప్రభుత్వ భవనాల కు తరలిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్‌ మనూచౌదరి తెలి పారు. కలెక్టరేట్‌లో అత్యవసర సేవల కోసం 08540230201 ఫోన్‌ కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. వెల్దం డ మండలం బండోనిపల్లి గ్రామ సమీపంలో కేఎల్‌ఐ కాలువ తెగిపోవడంతో పదెకరాల్లో పత్తి దెబ్బతిన్నది.


వర్షాలకు వనపర్తి జిల్లాలో దాదాపు మూడు వేల ఎ కరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అ త్యధికంగా వరి 1,276 ఎకరాల్లో, పత్తి పంట వెయ్యి ఎకరాల్లో దెబ్బతి న్నది. జూరాలకు భారీ స్థాయిలో వరద వస్తుండటంతో ఆత్మకూరు, పెబ్బే రు, చిన్నంబావి మండలాల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో వరి పంటలు మునిగిపోయే ప్రమాదం ఉంది. వనపర్తి మండలం జెరిపోతుల వాగు ఉధృతంగా ప్రవహస్తోంది. సోమవారం రాత్రి గల్లంతైన ఇద్దరిలో గోవిం దు, బుచ్చిరెడ్డి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. అమరచింత మండలం లో వంద ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్నది.


ఆత్మకూరు మండలంలో జూరాల ఎడమ కాలువ గండిపడే అవకాశం ఉం ది. మదనాపూర్‌ వద్ద ఊకచెట్టివాగు పొంగడంతో ఆత్మకూరు, అమరచింత మం డలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తకోట, అప్పరాల, రాణిపేట, సంకిరె డ్డిపల్లి, పాలెంలో సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. గోపాల్‌పేట మండలంలో డీ-8 కాలువకు గండిపడింది. గోపాల్‌పేటలో అ యోధ్యనగర్‌ కాలనీ జలదిగ్బంధంలో ఉండిపోయింది. వీపనగండ్ల మండలంలో పలుచోట్ల రహదారు లు కోతకు గురయ్యాయి. కల్వరాల, తూంకుంట, సంపత్‌రావు పల్లి, సంగినేనిపల్లి మధ్యలో భీమా కాలువకు గండ్లు పడ్డాయి. బండరావిపాకుల ముంపు గ్రామం లోకి నీరు చేరుతుంది. పెబ్బేరు, శ్రీరంగాపూర్‌, పానగల్‌, ఖిల్లాఘ ణపురం, చిన్నం బావి, పెద్దమందడి మండలాల్లో వరి పంట తీవ్రంగా దెబ్బతిన్నది.

Updated Date - 2020-10-15T07:06:56+05:30 IST