చెన్నైకి flood alert: ముంచెత్తుతున్న భారీ వర్షాలు

ABN , First Publish Date - 2021-11-07T16:59:27+05:30 IST

ఎడతెరిపి లేని వర్షాలు చెన్నైని కుదిపేస్తున్నాయి. దీంతో సిటీలోని పలు ప్రాంతాలతో పాటు..

చెన్నైకి flood alert: ముంచెత్తుతున్న భారీ వర్షాలు

చెన్నై: ఎడతెరిపి లేని వర్షాలు చెన్నైని కుదిపేస్తున్నాయి. దీంతో సిటీలోని పలు ప్రాంతాలతో పాటు సబర్బన్ ఏరియాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నై సిటీకి తాగునీటిని అందిస్తున్న చెంబరబాక్కం, పుజల్ రిజర్వాయ్లర్ గేట్లు తెరవనున్నారు. దీంతో సిటీలో 'ఫ్లడ్ అలర్ట్'ను అధికారులు ఆదివారంనాడు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంచీపురం, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్లకు స్టేట్ వాటర్ రిసోర్సెస్ అధారిటీ సూచించింది. శనివారం ఉదయం నుంచి చెన్నై, కాంచీపురంలోని పలు సబర్బన్ ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయ కలిగింది. 2015 నుంచి ఇంత భారీ వర్షాలు సిటీలో చూడలేదని ప్రైవేటు వెదర్ బ్లాగర్స్ చెబుతున్నారు. నవంబర్ 10 వరకూ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Updated Date - 2021-11-07T16:59:27+05:30 IST