వర్షం..గణనీయంగా పెరిగిన సాగు

ABN , First Publish Date - 2020-09-19T09:43:47+05:30 IST

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గింది. దీం తో 10 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి

వర్షం..గణనీయంగా పెరిగిన సాగు

అంచనాలకు మించిన విస్తీర్ణం

17 మండలాల్లో  సాధారణానికి మించి వర్షం

14 చోట్ల సాధారణ వర్షపాతం

22శాతం అధికంగా వాన


ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండగా, నల్లగొండ జిల్లాలో అంచనాకు మించి వర్షపాతం నమోదవుతోంది. 31 మండలాల్లో ఎక్కడా లోటు వర్షపాతం లేదు. ఫలితంగా ఈ వానాకాలం దిగుబడులు రికార్డుస్థాయిలో ఉంటాయని వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి రావడంతో సాగు విస్తీర్ణం పెరిగింది.


సాగర్‌ 10 గేట్ల నుంచి నీటి విడుదల

నాగార్జునసాగర్‌, చింతలపాలెం: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు శుక్రవారం ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గింది. దీం తో 10 క్రస్ట్‌ గేట్లను పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.60 అడుగుల (310.8498టీఎంసీలు) నీరుంది. సాగర్‌కు 1,71,865 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే మొత్తంలో నీటిని ది గువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటిమట్టం 175 అడుగులు(45.77టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 174.51అడుగుల (45.10టీఎంసీలు) నీరుంది. ఎగువ నుంచి 1,69,093 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 1,40,566 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


మూసీ, డిండికి తగ్గిన వరద

కేతేపల్లి,డిండి,శాలిగౌరారం: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవా హం తగ్గింది. శుక్రవారం ఉదయం 13,520క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రానికి 10,570క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో ప్రాజెక్ట్‌ క్రస్ట్‌గేట్ట ను పూర్తిగా మూసేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645అడుగులు కాగా, ప్రస్తుతం 642.85అడుగుల మేర నీరు నిల్వ ఉంది. డిండి రిజర్వాయర్‌కు సైతం వరద తగ్గింది.దుందుభి నుంచి 4వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు కుడి, ఎడమ వైపు నుంచి అలుగుల ద్వారా 3700 క్యూసెక్కుల నీరు వెళ్తుండగా, చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లోని చెరువులు, కుంటలు నింపేందుకు ఎడమ కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటినిల్వ 2.4టీఎంసీల కు చేరింది. శాలిగౌరారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 21 అడుగుల వద్ద నిలకడగా ఉండగా, కుడి, ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.


యాదాద్రి, /బీబీనగర్‌, వ లిగొండ,నేరేడుచర్ల, అనంతగిరి: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శుక్రవారం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట, భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లో కురిసిన వర్షాలకు రహదారులు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బీబీనగర్‌ మండలం చిన్నేటి వా గు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బీబీనగర్‌-భువనగిరికి రాకపోకలకు ఆటకం కలిగింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం అరగంట పాటు భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు వరదతో నిండాయి. బీబీనగర్‌ మండలంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ము గ్దుంపల్లి, గొల్లగూడెం, మాదారం, అనాజీపురం మార్గాల్లో రాకపోకలు నిలిచిపోగా వరి పొలాలు నీట మునిగాయి. చిన్నేటివాగు ఉధృతంగా ప్రవహిస్తూ బీబీనగర్‌, బొల్లేపల్లి, సంగెం, భీమలింగం వద్ద మూసీలో కలుస్తోంది.


ఈ మా ర్గంలోని ముగ్దుంపల్లి, గొల్లగూడెం, మాదారం, అనాజీపూర్‌, గూడూరు, అన్నంపట్లలో లెవల్‌ బ్రిడ్జిలపై నుంచి వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో అటుగా ఎవరూ వెళ్లకుండా అధికారులు రోడ్డుకు అడ్డంగా కంచె ఏర్పాటు చేశారు. వలిగొండ మండలంలో ఓ మోస్తారు వర్షం కురిసింది.3.8మి.మీ. వర్షపాతం నమోదైంది. భువనగిరి పెద్దచెరువుకు చేరుతున్న వరదనీటిని, వడపర్తి కత్వ వద్ద ప్రవాహాన్ని చూసేందుకు స్థానికులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో చిల్లేపల్లి, పెంచికల్‌దిన్నె పరిధిలోని చెరువులు పూర్తిస్థాయిగా నిండి పొంగిప్రవహిస్తుండటంతో వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్షాలకు అనంతగిరి మండలంలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోదాడ చెరువు పొంగి ప్రవహిస్తుండటంతో అనంతగిరి-కోదాడ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా, గురువారం ప్రారంభమైన డిగ్రీ విద్యార్థులు పరీక్షలు హాజరయ్యేందుకు కోదాడ వెళ్లేందుకు రాకపోకలు నిలిచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


దిగుబడి పెరుగుతుంది

జిల్లాలో వరి, పత్తి పంటల సాగు ఆశాజనకంగా ఉన్నాయి. 22శాతం అధికంగా కురిసిన వర్షాల కారణంగా పంటలు కళకళలాడుతున్నాయి. దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంది. నల్లరేగడి నేలల్లో నాలుగువేల ఎకరాల్లో పత్తి నీటమునిగింది. వర్షం తగ్గితే ఆ పంట కూడా కోలుకునే అవకాశం ఉంటుంది.

- శ్రీధర్‌రెడ్డి, నల్లగొండ జేడీఏ


పంటలకు వెన్నుదన్ను

కొన్నేళ్లుగా వర్షాలు అతివృష్టి లేదం టే అనావృష్టిగా నమోదవుతున్నాయి. ఇవి రైతన్నలను తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురిచేశా యి. అలాంటిది ఈ వానాకాలంలో గడిచిన వారం రోజులుగా తీవ్ర ఎండ, ఉక్కపోత, దుబ్బ చేలకు నీళ్లు లేక మొక్కలు మాడుతున్నాయని అనుకుంటున్న సమయంలో వరుణుడు కరుణించాడు. దీంతో పత్తి పంటలకు జీవం వచ్చింది. గతంలో నాగార్జునసాగర్‌ నిండితేనే పూర్తిస్థాయి లో వరిసాగయ్యేది. ఎగువ నుంచి దఫాలుగా వచ్చే వరద తో ఎప్పటికి నిండుతుందో అని, ఉన్న నీటితో సాగర్‌ ఆయకట్టులో నారుమడులు పోసేవారు. ఈ ఏడాది కూడా, నారుమడులకు సాగర్‌ నీరు విడుదల చేయాలని అనుకుంటున్న వేళ, ఆగస్టు మొదటి వారం నుంచే వరద పోటెత్తింది. దీంతో వానాకాలం సాగు జోరందుకుంది. నల్లగొండ జిల్లా లో 7.12లక్షల ఎకరాల్లో పత్తి, 3.80లక్షల ఎకరాల్లో వరి సేద్యమైంది.


వానలు సకాలంలో కురుస్తుండటంతో పత్తి దిగుబడి ఎకరాకు సగటున 10-15 క్వింటాళ్ల వరకు ఉం టుందని వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాలతో పత్తి బయటపడినట్టేనని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో వర్షాభా వం, తెగుళ్లు వంటివి లేకపోవడంతో రైతులకు ఆర్థికంగా కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. వరి ఎకరాకు 35-40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుదని అంచనా వేస్తున్నారు. అయితే తాజా వర్షాలతో జిల్లాలో 4వేల  ఎకరాల్లో పత్తి నీటమునిగింది. ఈ పంటల న్నీ నల్లరేగడి నేలలు ఉన్న శాలిగౌరారం, మునుగోడు, మర్రిగూడ మండలాల్లోనివి. అయితే వర్షాలు ఆగితే నల్లరేగడి నేలల్లోని పంట కోలుకుంటాయని, రైతులు ఇబ్బందిపడే పరిస్థితి ఉండదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.


22శాతం అధిక వర్షపాతం నమోదు

వర్షాకాలం ప్రారంభం జూన్‌ నుంచి ఈనెల 18వరకు నల్లగొండ జిల్లాలో 442.6మి.మీ సగటు వర్షపాతానికి ఇప్ప టి వరకు 540.5 మి.మీ నమోదైంది. మొత్తంగా ఈ వానాకాలం ఇప్పటి వరకు 22 శాతం అదనపు వర్షపాతం నమోదైంది. నల్లగొండ జిల్లాలో మొత్తం 31 మండలాలకు 17 మండలాల్లో సాధారణానికి మించి, 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. లోటు వర్షపాతం ఎక్కడా లేదు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జిల్లాలో అత్యధికంగా 63.2శాతం వర్షపాతంతో గుర్రంపోడు మండలం ముందు ఉండగా, నల్లగొండలో 59.7శాతం, శాలిగౌరారంలో 55.8 శాతం నమోదైంది. అత్యల్పంగా గుండ్లపల్లిలో 12.5 శాతం, పెద్దవూరలో 5.1 శాతం,  నేరేడుగొమ్ములో 4.1 శాతం వర్షపాతం నమోదైంది.

Updated Date - 2020-09-19T09:43:47+05:30 IST