భారీ వర్షంతో నిలిచిన నీరు
గంటలో 21.4 మీ.మీ వర్షపాతం
వీధులు, శివారు ప్రాంతాలు జలమయం
సూళ్లూరుపేట, జనవరి 16 : ఈ ఏడాది పండుగలు వర్షార్పణమై ప్రజల ఆనందాన్ని ఆవిరి చేశాయి. శనివారం తెల్లవారుజామున అకాలవర్షం మరోసారి విరుచుకుపడింది. ఓ గంట వ్యవధిలో 21.4 మీ.మీ వర్షపాతం నమోదైంది. పట్టణంలోని వీధులన్నీ జలమయమయ్యాయి. షార్‌రోడ్డు, సాయినగర్ తదితర ప్రాంతాలు నీటిలో తేలియాడాయి. అయితే, ఉదయానికి తెరిపివ్వడంతో ప్రజలు పండగ అయిందనిపించారు.