రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి

ABN , First Publish Date - 2020-10-31T07:07:09+05:30 IST

అమరావతి రైతులను జైలుకు తరలించడానికి వారి చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శనివారం కలెక్టరేట్‌ వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వ ర్యంలో అఖిలపక్ష నాయకులు ప్రదర్శన జరిపి అనం తరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

రైతుల ఆత్మ గౌరవాన్ని కాపాడాలి

అమరావతి పరిరక్షణ సమితి ప్రదర్శన  
డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), అక్టోబరు30: అమరావతి రైతులను జైలుకు తరలించడానికి వారి చేతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ శనివారం కలెక్టరేట్‌ వద్ద అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వ ర్యంలో అఖిలపక్ష నాయకులు ప్రదర్శన జరిపి అనం తరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ‘అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు- రౌడీషీటర్లకు రాచమర్యాదలు’ అంటూ ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ ప్రదర్శనలో అమరావతి పరిరక్షణ సమితి పొలిటికల్‌ జేఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌, కాకినాడ పార్లమెంట్‌ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని, కాకినాడ సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆకుల వెంకటరమణ, కమ్యూనిస్ట్‌ పార్టీ నాయకుడు తోకల ప్రసాద్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాల శివ, ఆర్‌పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్ల వరప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా  కొండబాబు, నవీన్‌లు మాట్లాడుతూ అమరావతి రాజధాని కొనసాగించాలని సంవత్సర కాలంగా ఆ ప్రాంత రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారన్నారు. దీనికి పోటీగా కొంతమంది పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో పోటీ ఉద్యమం చేయించడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాన్ని నిలదీసిన రైతులపై ఎస్‌సీ,ఎస్‌టీ చట్టం కింద కేసులు నమోదు చేయడం దారుణమైన చర్యని అన్నారు. రిమాండ్‌ నుంచి జైలుకు తరలించే క్రమంలో రైతుల చేతులకు సంకెళ్లు వేయడం దారుణమైన విషయమన్నారు. ఈ కార్యక్రమం లో పలు సంఘాల నాయకులు గదుల సాయిబాబా, తాళ్లూరి రాజు, కొల్లాబత్తుల అప్పారావు, మల్లిపూడి వీరు, అంబటి చిన్న, చింతపల్లి కాశి, సీకోటి అప్పలకొండ, తుమ్మల రమేష్‌, వొమ్మి బాలాజీ, జోగా రాజు, రహీమ్‌, చింతలపూడి రవి, బంగారు సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T07:07:09+05:30 IST