చైనాలో కోవిడ్ ప్రభావంతో రైలు ప్రయాణాల్లో 53 శాతం తగ్గుదల

ABN , First Publish Date - 2020-07-12T21:24:24+05:30 IST

ప్రజలపై నోవల్ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. నలుగురు కలిసి ప్రయాణం

చైనాలో కోవిడ్ ప్రభావంతో రైలు ప్రయాణాల్లో 53 శాతం తగ్గుదల

బీజింగ్ : ప్రజలపై నోవల్ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. నలుగురు కలిసి ప్రయాణం చేయాలన్నా ఆందోళనకు గురవుతున్నారు. ఈ వైరస్ జన్మ స్థలంగా భావిస్తున్న చైనాలో 2020వ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో రైలు ప్రయాణాల్లో 53.9 శాతం క్షీణత నమోదైంది. 


చైనా స్టేట్ రైల్వే గ్రూప్ కంపెనీ లిమిటెడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 2020వ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో 81.8 కోట్ల రైల్వే ప్యాసింజర్ ట్రిప్స్ నమోదయ్యాయి. 


ప్రభుత్వం ఈ మహమ్మారిని నివారించేందుకు నిరంతరాయంగా కృషి చేస్తుండటంతో, మార్చి నుంచి రైల్వే ప్యాసింజర్ ట్రిప్స్‌లో పెరుగుదల కనిపించింది. జూన్‌లో మొత్తం 16.6 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించారు.  మే నెలలో ప్రయాణికుల కన్నా జూన్‌లో 9.4 శాతం మంది ఎక్కువ.


పరిశ్రమలు, కంపెనీల్లో ఉత్పత్తులు తిరిగి ప్రారంభమవడంతో రైల్వే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా.


Updated Date - 2020-07-12T21:24:24+05:30 IST