స్వల్ప దూరం రైళ్ల టిక్కెట్ ధరల పెంపు...కారణం ఇదేనట!

ABN , First Publish Date - 2021-02-25T13:39:31+05:30 IST

స్వల్ప దూరం నడిచే రైళ్ల టిక్కెట్ల రేట్లను రైల్వేశాఖ మూడు శాతం మేరకు...

స్వల్ప దూరం రైళ్ల టిక్కెట్ ధరల పెంపు...కారణం ఇదేనట!

న్యూఢిల్లీ: స్వల్ప దూరం నడిచే రైళ్ల టిక్కెట్ల రేట్లను రైల్వేశాఖ మూడు శాతం మేరకు పెంచింది. దీనివెనక ఉన్న కారణాన్ని కూడా భారతీయ రైల్వే తెలిపింది. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్నందున తక్కువ దూరం వెళ్లే రైళ్లలో ప్రయాణికుల సంఖ్య స్వల్పంగానే ఉంటోంది. ఈ టిక్కెట్ల పెంపు భారం 30-40 కిలోమీటర్ల దూరం వరకూ నడిచే రైళ్లలో ప్రయాణించేవారిపైననే  పడుతుందని పేర్కొంది. అంటే రూ. 20 నుంచి 30 రూపాయల మధ్య ఉన్న టిక్కెట్ ధరలు మాత్రమే పెరుగుతాయని తెలిపింది. కాగా రైళ్ల టిక్కెట్ల ధర పెంపుదల గురించి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒక ట్వీట్‌లో... పెట్రోల్, డీజిల్, గ్యాస్, రైలు ఛార్జీలు పెరగడంతో మధ్యతరగతి వర్గంపై మోయలేని భారం పడిందని పేర్కొన్నారు. 

Updated Date - 2021-02-25T13:39:31+05:30 IST