రైల్వే బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నల్లగొండ,జూన 29: నల్లగొండ పట్టణంలోని బ్రిడ్జి పనులను సకాలంలో పూర్తి చేసేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాల ని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం రైల్వే బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పనులు పూర్తయితే రాకపోకలు సుగమవుతాయని, దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు, అభివృద్ధి పనులు పట్టణంలో వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట మునిసిపల్ చైర్మన మందడి సైదిరెడ్డి, నాయకులు, అధికారులు ఉన్నారు.