ఇది హింసకు ప్రతీక.. వీడియో షేర్ చేసిన రాహుల్

ABN , First Publish Date - 2020-05-30T22:43:30+05:30 IST

ఓ మహిళను నలుగురు పురుషులు హింసిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఇది హింసకు ప్రతీక.. వీడియో షేర్ చేసిన రాహుల్

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళను నలుగురు పురుషులు హింసిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో షేర్ చేశారు. భారతీయ మహిళలు ఎదుర్కొంటున్న హింసకు ప్రతీక ఇదని ఆయన పేర్కొన్నారు. హింస అనేక రూపాల్లో కనిపిస్తోందన్న ఆయన... సాంస్కృతికంగా అది కొనసాగుతోందన్నారు. అదే సమయంలో మహిళలను ధిక్కార స్వభావంతో, అగౌరవంగా చూస్తున్నారని ట్వీట్ చేశారు. అయితే ఆ వీడియో ఎక్కడిది... వాళ్లంత ఎవరూ అన్న విషయాలను ఆయన తెలపలేదు. 



Updated Date - 2020-05-30T22:43:30+05:30 IST