మాజీ ప్రధాని మన్మోహన్ పుట్టినరోజున రాహుల్ ట్వీట్ ఇదే!

ABN , First Publish Date - 2020-09-26T17:01:03+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒక ట్వీట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు మనకు చాలా తక్కువమంది...

మాజీ ప్రధాని మన్మోహన్ పుట్టినరోజున రాహుల్ ట్వీట్ ఇదే!

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఒక ట్వీట్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రులు మనకు చాలా తక్కువమంది కనిపిస్తారన్నారు. మన్మోహన్ సింగ్ మనకు స్ఫూర్తిదాయకులన్నారు. అతని నిజాయితీ, సహనం మనకు ప్రేరణను అందిస్తాయన్నారు. మన్మోహన్ సింగ్‌కు హృదయ పూర్వక శుభాకాంక్షలు అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాజీ ప్రధాని మన్మోహన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఒక ట్వీట్‌లో మోదీ... మన్మోహన్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. 


Updated Date - 2020-09-26T17:01:03+05:30 IST