సముద్రంలో దూకి.. ఈతకొట్టిన రాహుల్ గాంధీ!

ABN , First Publish Date - 2021-02-25T06:47:22+05:30 IST

జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వచ్చారు.

సముద్రంలో దూకి.. ఈతకొట్టిన రాహుల్ గాంధీ!

కొల్లాం: జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల ఫోకస్ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలపైనే. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్నీ ఆయా రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేరళలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వచ్చారు. కొల్లాం జిల్లాలో జాలర్లతో ముచ్చటించిన ఆయన.. పడవలో సముద్ర విహారానికి వెళ్లారు. ఆ సమయంలో జాలర్లతో కలిసి ఈతకొట్టాలని ఆయన అనుకున్నారు. అంతే పడవలో నుంచి సముద్రంలో దూకి జాలర్లతో కలిసి ఈతకొట్టారు. దాదాపు గంటసేపు సముద్రంలో కలిసి ఈదులాడిన అనంతరం.. ‘‘ఇన్నాళ్లకు నా కల తీరింది’’ అని రాహుల్ అన్నారట. ఈ స్విమ్మింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2021-02-25T06:47:22+05:30 IST