ఢిల్లీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

ABN , First Publish Date - 2021-08-04T15:49:55+05:30 IST

దేశరాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం...

ఢిల్లీలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బాధిత కుటుంబాన్ని కలుసుకున్నారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ వెంట స్థానిక నేతలు కూడా ఉన్నారు. రాహుల్ తన వాహనంలో మృతురాలి తల్లిదండ్రులను కూర్చోబెట్టుకుని, వారిని పరామర్శించారు. ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్నారు. దీనికిముందు ఆమ్ ఆద్మీపార్టీ ఎమ్మెల్యే రాఖీ బిడ్లాన్, భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ తదితరులు కూడా మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం సంఘటనా స్థలంలో ధర్నా నిర్వహించారు. 


ఈ కేసులో ప్రధాన నిందితులు రాధేశ్యామ్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. ఘటన వివరాల్లోకి వెళితే నాంగల్ స్మశానవాటిక వద్ద నుంచి నీటిని తెచ్చేందుకు వెళ్లిన తొమ్మిదేళ్ల చిన్నారి ఇంటికి తిరిగిరాలేదు. తరువాత కుటుంబ సభ్యులకు ఆ చిన్నారి  మృతదేహం స్మశాన వాటిక దగ్గర కనిపించింది. విద్యుదాఘాతం కారణంగా చిన్నారి మరణించి ఉంటుందని భావించిన తల్లిదండ్రులు ఆ చిన్నారికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇంతలో గ్రామస్తులకు విషయం తెలిసి వారంతా అక్కడకు వచ్చి చితి మంటలపై నీటిని చల్లి, మృత దేహాన్ని బయటకు తీసి,  ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక మృతిపై అనేక అనుమానాలున్నాయని వారు పోలీసులు ఎదుట ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-04T15:49:55+05:30 IST