Abn logo
Aug 10 2021 @ 11:22AM

రాహుల్ డైరీ: అమ్మవారికి పూజలు, దర్గాలో ప్రార్థనలు!

శ్రీనగర్: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఈరోజు శ్రీనగర్‌లో బస చేస్తున్నారు. ఇక్కడ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. రాహుల్ తన పర్యటనలో ముందుగా గందర్‌బల్ జిల్లాలోని ఖీర్ భవానీ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం హజ్రత్‌బల్ దర్గాను సందర్శించారు. గురుద్వారా, షేఖ్ హమ్జా మఖ్దూమ్‌లను కూడా సందర్శించనున్నారు. ఈ రోజు సాయంత్రం రాహుల్ తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.