Abn logo
Apr 19 2021 @ 01:42AM

బెంగాల్‌లో రాహుల్‌ ఎన్నికల ర్యాలీల రద్దు

  • కొవిడ్‌ కేసుల్లో పెరుగుదలే కారణం
  • నేతలంతా ఆలోచించాలని సలహా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ర్యాలీలను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రద్దు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ సమయంలో ర్యాలీలు నిర్వహిస్తే తలెత్తే పరిణామాల గురించి ఆలోచించాలని రాజకీయ నేతలందరికీ ట్విటర్‌లో ఆయన సలహా ఇచ్చారు. బీజేపీ నేతల సభలకు భారీఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారని రాహుల్‌ విమర్శించారు. దేశంలో కొవిడ్‌ కేసులు భారీగా పెరుగుతున్న దశలో బెంగాల్‌లో భారీఎత్తున బహిరంగ సభలు నిర్వహించడంపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ నేత చిదంబరం తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాగా బెంగాల్‌లో తన ఎన్నికల ర్యాలీలను రద్దుచేసుకొని రాహుల్‌ గాంధీ ఇతర నేతలకు స్పూర్తిగా నిలిచారని కాంగ్రెస్‌ ప్రతినిధి జైవీర్‌ షెర్గిల్‌ ప్రశంసించారు. బీజేపీ తన మొండివైఖరిని విడనాడి రాహుల్‌ అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరారు.


Advertisement
Advertisement