Advertisement
Advertisement
Abn logo
Advertisement

అలరించిన నృత్యాభినయనం

గుంటూరు(సాంస్కృతికం), డిసెంబరు 5: స్థానిక బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై  ఆదివారం రాధామాధవ కల్చరల్‌ అసోసియేషన్‌, రాధామాధవ నాట్యక్షేత్రం సంయుక్త ఆధ్వర్యంలో 285వ నెలనెలా వెన్నెల కార్యక్రమం సందర్భంగా ఉదయం 9 నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహించిన కూచిపూడి నాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సుమారు 70 మంది విద్యార్థులు పలు కీర్తనలకు నృత్యాన్ని ప్రదర్శించారు. వీవీఐటీ చైర్మన్‌ వాసిరెడ్డి విద్యాసాగర్‌, డాక్టర్‌ జి.పెంచలయ్య, డాక్టర్‌ ఎం.ఆదినారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, తదితరులు పాల్గొని నాట్యగురువులను,  విద్యార్థులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి నాట్యాచారి ఎస్‌కే ఖలీల్‌ పర్యవేక్షించారు. 


Advertisement
Advertisement