రైతుల సమస్యలు తెలుసుకోవడానికే ‘రచ్చబండ’

ABN , First Publish Date - 2022-05-22T05:02:07+05:30 IST

గ్రామాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు.

రైతుల సమస్యలు తెలుసుకోవడానికే ‘రచ్చబండ’

జగదేవ్‌పూర్‌, మే 21: గ్రామాల్లో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం చేపడుతున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శనివారం జగదేవ్‌పూర్‌ మండలంలోని తీగుల్‌ నర్సాపూర్‌ సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించి, రైతు డిక్లరేషన్‌ కరపత్రాలను కొండపోచమ్మ వద్ద ఇంటింటికి తిరిగి పంచారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 

నంగునూరు: ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు తప్పడం లేదని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దేవులపల్లి యాదగిరి మండిపడ్డారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు తప్పెట శంకర్‌ ఆధ్వర్యంలో శనివారం నంగునూరు మండలంలోని సిద్ధన్నపేట మార్కెట్‌యార్డును సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అచ్చిన సత్తయ్య, చెలికాని యాదగిరి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

దుబ్బాక: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్‌ దుబ్బాక ఇన్‌చార్జి చెరుకు శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. శనివారం దుబ్బాక మండలం పోతారం గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

చిన్నకోడూరు: కాంగ్రెస్‌ రైతులకు అండగా ఉంటుందని పీసీసీ భూ కమిటీ మాజీ సభ్యుడు జంగిటి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు మిట్టపల్లి గణేష్‌ అన్నారు. శనివారం మండలంలోని విఠలాపూర్‌లో రైతు రచ్చబండ నిర్వహించారు. 

అక్కన్నపేట: మండలంలోని రామవరంలో నిర్వహించిన రచ్చబండకు కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీరాంచక్రవర్తి హాజరయ్యారు. 

Updated Date - 2022-05-22T05:02:07+05:30 IST