సత్వర సేవలు!

ABN , First Publish Date - 2020-03-27T11:14:27+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకుగాను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. వైద్య

సత్వర సేవలు!

కలెక్టరేట్‌ కంట్రోల్‌ రూమ్‌లో నిరంతర సేవలు

కీలక సమస్యలకు పరిష్కార మార్గం


విజయనగరం (ఆంధ్రజ్యోతి) :

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకుగాను కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ ప్రజలకు సత్వర సేవలు అందిస్తోంది. వైద్య ఆరోగ్యశాఖ, పోలీస్‌, రెవెన్యూ, పౌర సరఫరాల శాఖలకు చెందిన సిబ్బంది 24 గంటల పాటు కంట్రోల్‌ రూమ్‌లో సేవలందిస్తున్నారు. కరోనా వైరస్‌కు సంబంధించి ముందస్తుగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వాటిపై  ప్రజల నుంచి వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఇప్పటివరకూ 154 ఫిర్యాదులురాగా అవసరమైన వాటిని డీఎంహెచ్‌వో కార్యాలయానికి రిఫర్‌ చేస్తున్నారు.


పోలీస్‌ శాఖకు సంబంధించి ప్రతిరోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. మద్యం విక్రయాలు, లాక్‌డౌన్‌ పాటించని వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పౌరసరఫరా, రెవెన్యూ శాఖకు సంబంధించి 67 ఫిర్యాదులు అందాయి. నిత్యావసరాలు, కూరగాయలు, లాక్‌డౌన్‌ పాటించని కంపెనీలు, పరిశ్రమలు తదితర వాటిపై సుమారు 65 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై సంబంధిత అధికారులు  చర్యలకు ఉపక్రమిస్తున్నారు.  


సేవలను వినియోగించుకోండి

జిల్లా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా కంట్రోల్‌ రూమ్‌కు సంప్రదించండి.  ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాం. సత్వర పరిష్కార మార్గం చూపిస్తున్నాం. ప్రజలకు ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోండి. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులు, పుకార్లను నమ్మవద్దు. ప్రజా భాగస్వామ్యంతోనే కరోనా మహమ్మారి నియంత్రణ సాధ్యం.

ఎం.హరిజవహర్‌లాల్‌, కలెక్టర్‌, విజయనగరం


కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ల నంబర్లు

రెవెన్యూ , పౌరసరఫరాలు : 08922 236947

పోలీస్‌ వాట్సాప్‌ నంబరు : 6309898989 / 100

వైద్య ఆరోగ్య శాఖ : 08922 27950 

Updated Date - 2020-03-27T11:14:27+05:30 IST