నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి

ABN , First Publish Date - 2022-05-17T06:25:11+05:30 IST

విత్తన నిబంధన చట్టం ప్రకారం నాణ్యమైన పత్తి, వరి, కందులు, పెసరు విత్తనాలను విక్రయించాలని లేనట్లయితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ సహాయ సంచాలకులు కె.పద్మజ హెచ్చరించారు.

నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి
భువనగిరిలోని సీడ్స్‌, ఫర్టిలైజర్‌ షాపులో రికార్డులను తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులు

భువనగిరి రూరల్‌, మే16:  విత్తన నిబంధన చట్టం ప్రకారం నాణ్యమైన పత్తి, వరి, కందులు, పెసరు విత్తనాలను విక్రయించాలని లేనట్లయితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ సహాయ సంచాలకులు కె.పద్మజ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో  సోమవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం పర్యటించి సీడ్స్‌, ఫర్టిలైజర్‌ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. స్టాకు రిజిస్టర్‌, రికార్డుల నిర్వహణ పత్తి విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు.  అనంతరం మన గ్రోమోర్‌, పొద్దటూరు ఫర్టిలైజర్‌ గోదాంలో నిల్వలను పరిశీలించారు. ముందుగా బీబీనగర్‌ మండలం బ్రాహ్మణపల్లిలోని సీడ్స్‌, మ్యానిఫ్యాక్చరింగ్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. ఈసందర్భంగా ఆమె విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాష్ట్రంలో 8 ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసిందని తమ బృందం రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోని సీడ్స్‌, ఫర్టిలైజర్‌ షాపులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిందని తెలిపారు. ఈ తనిఖీలో భువనగిరి వ్యవసాయ సహాయ సంచాలకుడు భూక్య దేవ్‌సింగ్‌, ఏవో ఎ.వెంకటేశ్వర్‌ రెడ్డి, సీడ్‌ సర్టిఫికేషన అధికారి మహేష్‌, ఎస్‌వోటీ సబ్‌ ఇన్సపెక్టర్‌ పరమేశ్వర్‌, కానిస్టేబుల్‌ సంతో్‌షరెడ్డి తదితరులున్నారు. 

 షాపులను బంద్‌ చేసుకున్న యజమానులు 

సీడ్స్‌, ఫర్టిలైజర్స్‌ షాపుల తనిఖీలో భాగంగా సోమవారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారుల బృందం పర్యటన జిల్లా కేంద్రంలోని రెండు షాపుల్లో మాత్రమే తనిఖీలు చేపట్టింది. జిల్లా కేంద్రంలోని భువనగిరిలో ఆరు సీడ్స్‌,ఫర్టిలైజర్‌ షాపులు ఉండగా అందులో నాలుగు షాపులను ముందస్తు సమాచారంతో ఆ షాపులను ఆయా యజమానులు బంద్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అధికారుల తనిఖీలో వారి డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే ఆ షాపు యజమానులు దుకాణాలను బంద్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం టాస్క్‌ఫోర్స్‌ కమిటీ అధికారుల దృష్టికి తీసుకవెళ్లగా రెండు మూరు రోజుల్లో మరోమారు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొనడం కొసమెరుపు.

Updated Date - 2022-05-17T06:25:11+05:30 IST