దూడను మింగిన కొండచిలువ... చనిపోయి ప్రతీకారం తీర్చుకున్న మూగజీవి!

ABN , First Publish Date - 2021-08-31T11:53:16+05:30 IST

కొండచిలువకు అది వేటాడే జంతువును...

దూడను మింగిన కొండచిలువ... చనిపోయి ప్రతీకారం తీర్చుకున్న మూగజీవి!

బ్యాంకాక్: కొండచిలువకు అది వేటాడే జంతువును దాని లోపల ఇముడ్చుకునే సామర్థ్యం ఉంటుంది. ఒక కొండచిలువ ఇదేపనిని చేసింది. అయితే అదే దాని చివరి వేటగా మారింది. ఆ కొండచిలువ ఒక దూడను చంపేసి మింగేసింది. అయితే ఆ తరువాత అది ప్రాణాలు కోల్పోయింది.  మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో జరిగింది.  


అక్కడి ఫిట్సనులోక్ ప్రావిన్స్‌లో వేటకు బయలుదేరిన ఒక భారీ కొండచిలువకు రెండేళ్ల దూడ కంటపడింది. దీంతో ఆ కొండచిలువ దానిపై దాడిచేసి, దాని గొంతుకొరికి, అమాంతం దానిని మింగేసింది. అయితే ఆ తరువాత ఆ కొండచిలువ కొంచెం కూడా కదలలేకపోయింది. ఇంతలో ఆ దూడ యజమాని దానిని వెదుకుతుండగా, ఒక కొండచిలువ అక్కడి గడ్డి మధ్యలో కనిపింది.


అయితే దాని పొట్టపగిలిపోయివుంది. దాని పొట్టలో ఆ దూడ శరీరం కనిపిస్తోంది. దీంతో యజమానికి జరిగినదంతా అర్థమైపోయింది. ఈ ఘటన గురించి స్థానిక అధికారి ఒకరు మాట్లాడుతూ కొండ చిలువ కాస్త బలంగా ఉన్న దూడను మింగేసింది. అయితే ఆ కొండచిలువ కడుపులో దూడ ఇమడలేదు. ఫలితంగా ఆ కొండచిలువ పొట్ట పేలిపోయింది. దీంతో అది మృతి చెందిందని తెలిపారు. 

Updated Date - 2021-08-31T11:53:16+05:30 IST